BigTV English

Sarfaraz Khan: టెస్ట్‌ల్లో సర్ఫరాజ్‌కు అవకాశం రాకపోవడానికి అదే కారణం..!

Sarfaraz Khan: టెస్ట్‌ల్లో సర్ఫరాజ్‌కు అవకాశం రాకపోవడానికి అదే కారణం..!

Sarfaraz Khan: త్వరలోనే వెస్ట్ ఇండీస్ టూర్‌కు ఇండియా బయలుదేరనుంది. ఈ క్రమంలో టూర్‌కు వెళ్లే ప్లేయర్స్ లిస్ట్ బయటికొచ్చింది. ఈ లిస్ట్‌ను చూసిన చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌ షాక్‌కు గురయ్యారు. దీన్ని బట్టి చూస్తే.. సీనియర్ ప్లేయర్లను టూర్‌లో నుండి తొలగించాలని సెలక్టర్స్ నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీమ్‌లో సర్ఫరాజ్ ఎందుకు లేడు అనే విషయంపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.


ఐపీఎల్‌లో అతిచిన్న వయసులో డెబ్యూ ఇచ్చి తన సత్తా ఏంటో చాటుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఐపీఎల్‌లో తమ ఆటతో ఆకట్టుకున్న ఆటగాళ్లు చాలావరకు నేషనల్ టీమ్‌లో తమకు చోటు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే సర్ఫరాజ్ పర్ఫార్మెన్స్, ట్రాక్ రికార్డ్ చూసి కచ్చితంగా తనను ఈసారి టెస్ట్‌కు సెలక్ట్ చేస్తారని చాలామంది టీమిండియా ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పైగా అలా జరగకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయంటూ రూమర్స్ బయటికొచ్చాయి.

ఐపీఎల్‌లో బాగా ఆడినా కూడా టెస్ట్‌లకు సర్ఫరాజ్ ఖాన్ సెలక్ట్ కాకుండా ఉండడానికి కారణం తన ప్రవర్తన అని బీసీసీఐ అధికారి తెలిపారు. అంతే కాకుండా తన ఫిట్‌నెస్ కూడా దీనికి ఒక కారణం అన్నారు. అసలైతే సర్ఫరాజ్ వయసు 25 ఏళ్లే. కానీ చూడడానికి అలా ఉండడని, ఫిట్‌నెస్ మెయింటేయిన్ చేయడు అని క్రికెట్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండే తనను విమర్శలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు తన టెస్ట్‌కు సెలక్ట్ అవ్వకపోవడానికి కూడా అదే కారణమని అధికారి అంటున్నారు.


అంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్లేయర్‌ను వద్దనుకోవడం తమకు కూడా ఇష్టం లేదని, కానీ కోపం విషయంలో, తన బరువు విషయంలో సర్ఫరాజ్ జాగ్రత్తలు వహిస్తే.. తరువాతి టెస్ట్‌లలో తనకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు అంటున్నారు. కానీ తనతో సన్నిహితంగా ఉండే అధికారులు మాత్రం సర్ఫరాజ్ కోపాన్ని కారణంగా చూపించి, తనను టెస్ట్‌కు సెలక్ట్ చేయకపోవడం తప్పని వాదిస్తున్నారు. దీనిపై సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు ఏ విధంగానూ రియాక్ట్ అవ్వలేదు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×