Sehwag -Mendis : టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతని ఓపెనింగ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. అతను క్రీజులో ఉన్నాడంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. వాస్తవానికి సచిన్ కంటే కూడా సెహ్వాగ్ ఔట్ అయ్యాడంటే.. ప్రత్యర్థులు సంబురాలు చేసుకునేవారు. ఎందుకంటే సెహ్వాగ్ ఉంటే భారీ స్కోర్ చేస్తాడనే భయం ఉండేది. అయితే ఒకానొక సమయంలో శ్రీలంక బౌలర్ మెండిస్ చాలా భయంకరంగా బౌలింగ్ చేసేవాడు. స్పిన్నర్ గా మెండీస్.. ముత్తయ మురళీధరన్ తో కలిసి అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు. అయితే మెండీస్ స్పిన్ కి టీమిండియా బ్యాటర్లు అంతా భయపడేవారు. అతను ఎటు నుంచి బంతిని విసిరి వికెట్లకు తాకిస్తాడేమోనని భయకరంగా భయపడేవారు. అలాంటి సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ మెండిస్ బౌలింగ్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి చుక్కలు చూపించాడు. ఇప్పటికీ సెహ్వాగ్ ఇన్నింగ్స్ గురించి ఎవ్వరూ మరిచిపోరు.
ముఖ్యంగా టెస్టుల్లో తన బ్యాట్ తో డబుల్ సెంచరీ చేశారు. 231 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు సెహ్వాగ్. గాలెలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో మంచి స్కోరుకు నడిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెహ్వాగ్ ఒక్కడే 60 శాతం పరుగులు చేసాడు. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసి భారత్ 170 పరుగుల తేడాతో గెలిపించి సిరీస్ ను 1-1 సమం చేసాడు. వాస్తవానికి 2008లో అజంతా మెండిస్ భారత్ ను చిత్తు చేశాడు. ఆ తరువాత కొద్ది నెలలకే టీమిండియా మూడు టెస్టులు, 5 వన్డేల కోసం శ్రీలంకలో పర్యటించింది. ముత్తయ్య మురళీధరన్ ల సహకారంతో భారత్ తొలి టెస్ట్ లో ఇన్నింగ్స్ మరియు 239 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఇద్దరూ స్పిన్నర్లు తొలి టెస్టులో 19 వికెట్లు పడగొట్టారు.
ఇక రెండ టెస్ట్ లో సెహ్వాగ్ ప్రభావం చూపించాడు. మెండిస్ బౌలింగ్ లో వీరేంద్ర సెహ్వాగ్ 91 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి విధ్వంసం చేశాడు. ఆ మ్యాచ్ లో 22 ఫోర్లు, 4 సిక్సర్లుగా మలిచాడు. ఇద్దరూ స్పిన్నర్లు కూడా సెహ్వాగ్ ను ఔట్ చేయలేకపోయారు. గంభీర్ ను 56 పరుగుల వద్ద మెండీస్ ఔట్ చేసిన తరువాత భారత్ రెండు ఓవర్ల వ్యవధిలోనే రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా సెహ్వాగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్మణ్ సెహ్వాగ్ కి కాస్త మద్దతు ఇచ్చాడు. 5 వికెట్ కి 100 పరుగులు జోడించిన తరువాత 39 పరుగులు చేసి లక్ష్మణ్ ఔట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సెహ్వాగ్ చివరి వరకు పోరాడాడు. సునీల్ గవాస్కర్ తరువాత భారత్ తరుపు సెహ్వాగ్ 200 మార్కును దాటాడు. అంటే 200 మార్క్ ను దాటిన రెండో బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ కావడం విశేషం. ఇక ఆ తరువాత పాకిస్తాన్ పై ట్రిపుల్ సెంచరీ చేశాడు సెహ్వాగ్.