BigTV English

OTT Movie : టెర్రరిస్టు గ్రూప్ తో కుమ్మక్కు… లేడీ ఏజెంట్ రివేంజ్ ప్లాన్ కు మైండ్ బ్లాక్.. యాక్షన్-ప్యాక్డ్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : టెర్రరిస్టు గ్రూప్ తో కుమ్మక్కు… లేడీ ఏజెంట్ రివేంజ్ ప్లాన్ కు మైండ్ బ్లాక్.. యాక్షన్-ప్యాక్డ్ సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా దుమ్ములేపుతోంది. ఈ చిత్రం లండన్‌లోని వన్ కెనడా స్క్వేర్‌లో జరిగే హై-స్టేక్స్ హాస్టేజ్ డ్రామాతో ‘డై హార్డ్’ ‘మిషన్ ఇంపాసిబుల్’ సినిమాలని గుర్తుచేస్తుంది. ఈ సినిమా గ్లాస్ క్లీనింగ్ చేసే ఒక మహిళ, ఉగ్రవాదుల నుంచి 300 మందిని కాపాడటానికి చేసే ప్రయత్నంతో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

జోయ్ మాజీ బ్రిటిష్ ఆర్మీ సైనికురాలు. గతంలో ఒక సహోద్యోగిపై దాడి చేసినందుకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఇప్పుడు లండన్‌లోని వన్ కెనడా స్క్వేర్‌లో విండో క్లీనర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె బాల్యంలో శాడిస్ట్ తండ్రి నుంచి తప్పించుకోవడానికి వాల్-క్లైంబింగ్ నేర్చుకుంటుంది. ఆమె అన్న మైఖేల్ ఆటిజం ఉన్న ఒక ఆన్‌లైన్ యాక్టివిస్ట్. కేర్ హోమ్‌లలోని అవినీతిని ఎక్స్‌పోజ్ చేస్తుంటాడు. ఒక రోజు జోయీ తన అన్నను తన పని ప్రదేశానికి తీసుకెళ్తుంది. అక్కడ ఆమె తన సహోద్యోగి నోహాతో కలిసి బిల్డింగ్ బయట విండోస్ క్లీన్ చేస్తుంది. ఇంతలో అగ్నియన్ ఎనర్జీ కంపెనీ షేర్‌హోల్డర్ గాలాలో ఎర్త్ రివల్యూషన్ అనే ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ గ్రూప్ స్లీపింగ్ గ్యాస్ వాడి బిల్డింగ్‌ని టేకోవర్ చేసి, 300 మందిని బందీలుగా చేస్తుంది. ఇందులో నోహా కూడా సభ్యుడిగా ఉంటాడు.

గ్రూప్ లీడర్ మార్కస్ బ్లేక్ కంపెనీ వల్ల వస్తున్న పర్యావరణ విధ్వంసాన్ని మాత్రమే బయటపెట్టాలనుకుంటాడు. కానీ నోహా, బ్లేక్ ఆలోచనలతో విభేదిస్తూ, కంపెనీ ఓనర్ జెఫ్రీ మిల్టన్‌ని చంపేస్తాడు. నోహా, బ్లేక్‌ని, అతని లాయలిస్ట్‌లను చంపి, గ్రూప్ లీడర్‌షిప్‌ని టేకోవర్ చేసి, బందీలకు ఎక్స్‌ప్లోసివ్స్ పెట్టి, తన హార్ట్‌బీట్‌కి సింక్ అయిన డెడ్ మాన్స్ స్విచ్‌తో బెదిరిస్తాడు. జోయీ 50 అంతస్తుల ఎత్తులో బిల్డింగ్ బయట నుంచి తన అన్న మైఖేల్‌తో సహా బందీలను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె తన క్లైంబింగ్ స్కిల్స్, మిలిటరీ ట్రైనింగ్ వాడుకుని, నోహాతో ఫైట్ చేస్తుంది. ఆమెకు సుపరింటెండెంట్ క్లైర్ హ్యూమ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కాన్ బయట నుంచి సహాయం చేస్తారు. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో హీట్ పుట్టిస్తుంది. జోయ్ 300 మందిని కాపాడుతుందా ? నోహాని ఎలా ఎదుర్కొంటుంది ? అనే విషయాలను ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.


ఏ ఓటీటీలో ఉందంటే

‘Cleaner’ 2025లో విడుదలైన బ్రిటిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. మార్టిన్ క్యాంప్‌బెల్ దర్శకత్వంలో డైసీ రిడ్లీ (జోయ్ లాక్), టాజ్ స్కైలర్ (నోవా), క్లైవ్ ఓవెన్ (మార్కస్ బ్లేక్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై, 1 గంట 36 నిమిషాల రన్‌టైమ్‌తో, HBO మ్యాక్స్, అమెజాన్ వీడియో, ఆపిల్ టీవీలో ఇంగ్లీష్ ఆడియోతో, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read Also : మగాళ్లను దారుణంగా చంపే లేడీ కిల్లర్… 20 ఏళ్ల తరువాత అచ్చం అదే రీతిలో హత్యలు… కిర్రాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : 200 మంది అమ్మాయిలతో పాడు పని… చేతబడితో మతిపోగోట్టే హర్రర్ మూవీ

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

OTT Movie : భర్తను కట్టేసి భార్యతో అపరిచితుడి ఆటలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : మంచాన పడ్డ తల్లి ఆఖరి కోరిక… కార్పొరేట్ వరల్డ్ తో కనెక్షన్… మనసును పిండేసే ఫ్యామిలీ మూవీ

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ

Big Stories

×