IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 1st ODI ) మధ్య నిన్నటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పెర్త్ వేదికగా నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో టీం ఇండియా దారుణ ఓటమిని చవిచూసింది. భారత గడ్డపై వరుసగా మ్యాచ్ లు గెలిచిన గిల్ సేన… విదేశీ గడ్డపై మాత్రం చేతులెత్తేసింది. ప్రత్యర్థి బౌలర్లు వేసే బంతులకు చిత్తయింది. అయితే మొదటి వన్డేలో టీమిండియా ఓటమికి గౌతమ్ గంభీర్ ప్రయోగాలే కారణం అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ను ఆడించకుండా పెద్ద తప్పిదం చేశారని ఫైర్ అవుతున్నారు టీమిండియా అభిమానులు. అతడు ఒక్కోడు ఆడితే మ్యాచ్ స్వరూపం మారిపోయేదని అంటున్నారు. ఇదొక్కటే కాదు, టీమిండియా ఓటమికి 100 కారణాలు చెబుతున్నారు అశ్విన్ లాంటి సీనియర్ మాజీ క్రికెటర్లు.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నిన్న పెర్త్ వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి గౌతమ్ గంభీర్ కారణమంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కీలక ప్లేయర్లను తుది జట్టులో ఉంచకపోవడం, హర్షిత రాణా లాంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం కారణంగానే టీమిండియా ఓడిపోయిందని అంటున్నారు. మంచి ఫామ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ ను నిన్నటి మ్యాచ్ లో ఆడించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో కనీసం మూడు వికెట్లు తీయగల సత్తా కుల్దీప్ యాదవ్ కు ఉంది. అలాంటి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను కాదని, వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడంపై మండిపడుతున్నారు.
సుందర్ బౌలింగ్ గురించి, పక్కకు పెడితే, బ్యాటింగ్ లో దారుణంగా విఫలం అయ్యాడు. ఇక ప్రసిద్ధ కృష్ణ కంటే జూనియర్ అయిన హర్షిత్ రాణాను బౌలర్ గా నిన్న తీసుకున్నారు. దానిపై కూడా మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. హర్షిత్ రాణా లాంటి ప్లేయర్ ను ఎందుకు తీసుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. ఆస్ట్రేలియా లాంటి గడ్డపైన అద్భుతంగా రాణించే మహమ్మద్ షమీని ఈ సిరీస్ కు సెలెక్ట్ చేయకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా రవీంద్ర జడేజా లాంటి ఆల్ రౌండర్ ను కీలక సిరీస్ కు ఎంపిక చేయకపోవడం కూడా దారుణం అంటూ మండిపడుతున్నారు. యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రాను కూడా వన్డే సిరీస్ కు తీసుకోలేదు. అతనికి ప్రస్తుతం రెస్ట్ ఇచ్చారు. ఆస్ట్రేలియా లాంటి జట్లతో మ్యాచ్ లు ఆడేటప్పుడు కచ్చితంగా సీనియర్లు ఉండాలని, జూనియర్లతో పని కాదని మండిపడుతున్నారు.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
🚨Ravi Ashwin thrashed Gautam Gambhir for dropping Kuldeep Yadav & playing too many all rounders.
"Please focus on bowling too, if Kuldeep can't bowl on these big grounds with freedom then where is he gonna bowl? They will talk about this batting depth but it is batter's job to… pic.twitter.com/C4Uphr4Ed6
— Rajiv (@Rajiv1841) October 19, 2025