Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లీ తనదైన ఆటతీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం కోహ్లీ టెస్టులు, టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఐపీఎల్, వన్డే మ్యాచ్లను మాత్రమే ఆడతానని పేర్కొన్నాడు. కోహ్లీ ఆట తీరుకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కాగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కోహ్లీ ఆడాడు. కానీ అందులో కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్ లలో మొత్తం 39 సార్లుగా డకౌట్ అయిన వ్యక్తిగా కోహ్లీ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇక కోహ్లీ గత కొన్ని నెలల నుంచి లండన్ లో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
తన భార్య పిల్లలతో కలిసి లండన్ కు కోహ్లీ షిఫ్ట్ అయ్యారు. అయితే కోహ్లీ లండన్ లో ఉంటున్నప్పటికీ మ్యాచ్లు ఆడే సమయంలో తిరిగి ఇండియాకు వస్తారు అనంతరం మళ్లీ తిరిగి లండన్ వెళ్తారు. అయితే కోహ్లీ లండన్ షిఫ్ట్ అవ్వడానికి గల కారణం ఏంటో తాజాగా తెలిపాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం గడపడానికి లండన్ షిఫ్ట్ అయ్యానని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెల్లడించారు. గొప్ప తండ్రిగా తన పిల్లలతో కలిసి ఆడుకోవడాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తున్నానని కోహ్లీ తెలిపాడు. ఈ ఫేజ్ చాలా అద్భుతంగా ఉందని కోహ్లీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన అనంతరం కోహ్లీ లండన్ కు తిరిగి వెళ్లిపోయాడు. గత కొన్ని నెలల నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా సినిమాలలో నటించడం లేదు. కేవలం కొన్ని యాడ్ షూట్స్ లలో మాత్రమే పాల్గొంటుంది.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
అంతేకాకుండా లండన్ లో ఉంటే వారిని ఎవరు పెద్దగా గుర్తుపట్టారని బయటకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని కోహ్లీ గతంలో చెప్పారు. ఇండియాలో ఉంటే బయటికి వెళ్లినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరూ వారిని గుర్తుపట్టి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు అడుగుతున్నారని అన్నాడు. ఆ కారణం చేతనే కోహ్లీ లండన్ కు వెళ్లిపోయాడని ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా, కోహ్లీ లండన్ లో దాదాపు 50 కోట్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసి ఆ ఇంట్లో ఉంటున్నట్టుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. తనకు నచ్చిన విధంగా ఇంటిని డిజైన్ చేయించుకొని ఆ ఇంట్లో చాలా భార్య పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటున్నారు.