Big Stories

Prithvi Shaw: నెట్టింట పృథ్వీ షా చర్చ.. రచ్చరచ్చ..

Delhi Capitals Ignoring Prithvi ShawDelhi Capitals Ignoring Prithvi Shaw(Sports news in telugu): ఢిల్లీ క్యాపిటల్స్ వరుసపెట్టి పరాజయాలతో ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో కీలకంగా ఉన్న ఓపెనర్ పృథ్వీ షాని పక్కన పెట్టడంపై నెట్టింట తీవ్ర దుమారం రేగుతోంది. అయితే తను 2023 సీజన్ లో ఎక్కువ పరుగులు చేయలేదు. దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త సీజన్ లో ఇలా పక్కన పెట్టడం భావ్యం కాదని అంటున్నారు. పృథ్వీ షా ప్లేస్ లో ఆంధ్రా ఆటగాడు రికీ భుయ్ కి అవకాశం ఇచ్చారు.

- Advertisement -

ముఖ్యంగా వసీం జాఫర్, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ టామ్ మూడీ ఇద్దరూ ఢిల్లీ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. పృథ్వీ షా అద్భుతమైన ఆటగాడని టామ్ మూడీ అన్నాడు. పృథ్వీ షా కి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉంది. అలాంటి ఆటగాడిని డగౌట్ గా ఎందుకు కూర్చోబెట్టారో అర్థం కావడం లేదని అన్నాడు. కానీ అతడు చాలా డేంజరస్ ఆటగాడని తెలిపాడు. కూర్చోబెడితే పరుగులు ఎలా చేస్తారని ఈఎస్పీఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

- Advertisement -

వసీం జాఫర్ మాట్లాడుతూ పృథ్వీ షాని బెంచ్ కే పరిమితం చేయడం తెలివైన నిర్ణయం కాదని అన్నాడు. గత సీజన్ లో రాణించి ఉండకపోవచ్చు, అది ఏడాది గడిచిపోయింది కదా. ఇప్పుడు అవకాశాలిచ్చి పరుగులు చేయకపోతే అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని అన్నాడు. ఇదిలా ఉండగా దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా ఆడిన రికీ భుయ్ ఇక్కడ ఐపీఎల్ లో ఇబ్బంది పడుతున్నాడు.

Also Read: Sunil Gavaskar: విరాట్ ఒక్కడు ఎంతకాలం లాగుతాడు: గవాస్కర్ ఆవేదన

ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. ‘పృథ్వీ షా ఓపెనర్. అయితే టీమ్ నిర్ణయం మేరకు మిచెల్ మార్స్, డేవిడ్ వార్నర్‌తో ఓపెనింగ్ చేయించాలని అనుకున్నాం. రికీ భుయ్ మిడిలార్డర్ బ్యాటర్. ఆ మూడు స్థానాలు అలా ఫిల్ అయ్యాయి’ అని అన్నాడు. అందుకే అడ్జస్ట్ కాక పక్కన పెట్టినట్టు వివరించాడు. సౌరవ్ చెప్పింది కరెక్టేనని కొందరు కామెంట్ చేస్తున్నారు. వీరిలో ఎవరైనా ఫెయిలైతే పృథ్వీ షాకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News