E-Paper
Advertisement

సీనియ‌ర్ల‌తో బీసీసీఐ ర‌హ‌స్య మీటింగ్? ఏ క్ష‌ణ‌మైనా గంభీర్ ను గెంటేయ‌డం గ్యారెంటీ!

సీనియ‌ర్ల‌తో బీసీసీఐ ర‌హ‌స్య మీటింగ్? ఏ క్ష‌ణ‌మైనా గంభీర్ ను గెంటేయ‌డం గ్యారెంటీ!
Advertisement

Senior Indian players unhappy with Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియాలో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను (Gautam Gambhir) సీనియర్ క్రికెటర్లు అందరూ టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతని కోచింగ్ విధానం, ప్లేయర్ల సెలక్షన్ పైన తీవ్ర అసంతృప్తిగా ఇండియన్ సీనియర్ క్రికెటర్లు ఉన్నారట. ఈ నేపథ్యంలోనే బీసీసీఐకి ( BCCI ) కూడా ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు గౌతమ్ గంభీర్ తో తరచూ డ్రెస్సింగ్ రూమ్ లో గొడవలు కూడా పెట్టుకుంటున్నారట సీనియర్ క్రికెటర్లు. ఈ విషయం గ్రహించిన బీసీసీఐ రంగంలోకి దిగిందని అంటున్నారు. సీనియర్ క్రికెటర్లతో రహస్య మంతనాలు కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

సీనియ‌ర్ల‌తో బీసీసీఐ ర‌హ‌స్య మీటింగ్? గంభీర్ ను గెంటేయ‌డం గ్యారెంటీ!

Advertisement

ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ ను పీకి పడేయండి అంటూ సీనియర్ క్రికెటర్లు కుండ బద్దలు కొట్టి చెప్పారట. ఇక సీనియర్ క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్న విషయం నేపథ్యంలో సానుకూలంగానే బిసిసిఐ స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గౌతమ్ గంభీర్ పైన ఏ క్షణమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అతని పక్కకు పెట్టి వీవీఎస్ లక్ష్మణ్ కు ఫుల్ పవర్స్ ఇవ్వాలని సీనియర్ క్రికెటర్లు కూడా సూచనలు చేశారట. దానిపై బీసీసీఐ సమయం కోరుతూ.. సానుకూలంగా స్పందించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఏ క్షణమైనా గౌతమ్ గంభీర్ బ్యాగులు సర్దుకోవాల్సిందేనని పోస్టులు వైరల్ అవుతున్నాయి.

గంభీర్ ను సీనియర్లు ఎందుకు టార్గెట్ చేశారంటే ?

టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్.. తన జర్నీని దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ జర్నీలో గౌతమ్ గంభీర్ చాలా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఎవడికి పడితే వాళ్లకు టీమిండియాలో అవకాశాలు ఇస్తూ… వివాదానికి తెర లేపాడు. తనకు నచ్చిన క్రికెటర్లను మాత్రమే టీమిండియాలోకి తీసుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, గుజరాత్ టైటాన్స్ కు సంబంధించిన ఇతర ఆటగాళ్లు మాత్రమే టీమిండియాలో గత రెండు సంవత్సరాలుగా కనిపించారు. ఆఫ్ఘనిస్తాన్ పైన ఆడిన టెస్టు మ్యాచ్ సందర్భంగా.. దాదాపు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లే ఉన్నారు.

Advertisement

ఈ మ‌ధ్య‌ శ్రేయస్ అయ్యర్ కు సంబంధించిన పంజాబీ కింగ్స్ ప్లేయర్లు కూడా తెరపైకి వస్తున్నారు. సీనియర్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ లాంటివాళ్ళు అవకాశాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లను మాత్రం పట్టించుకోవడం లేదు గంభీర్. ఇటు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని వరల్డ్ కప్ నుంచి తప్పించే కుట్ర కూడా గంభీర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటన్నిటిని గ్రహించిన సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ… గౌతమ్ గంభీర్నే పంపించాలని అందరినీ ఏకం చేశారట. జట్టులో ఉన్న సీనియర్ క్రికెటర్లను కలుపుకొని.. బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

Also Read: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

Related News

టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

స్టీవ్ వా ప‌రువు తీసిన బంగ్లా క్రికెట‌ర్ అష్రాఫుల్…అత‌ని ఆత్మ‌క‌థ‌లో అన్ని ప‌చ్చి అబద్దాలే

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు…ఈ ద‌రిద్రుల‌ను అల్లా కూడా కాపాడ‌లేడు

ఐపీఎల్ 2027కు ముందే పెను ప్ర‌కంప‌న‌లు..బీసీసీఐని చావుకొట్టిన ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు..!

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

Big Stories

Advertisement
×