E-Paper
Advertisement

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!
Advertisement

Vida Electric Records 3 Lakh Sales: హీరో మోటోకార్ప్‌ కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా భారత మార్కెట్లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. కంపెనీ మొత్తం రిటైల్ అమ్మకాలు 3 లక్షల మార్క్‌ ను దాటాయి. తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి 2026 ఆగస్టు 1 వరకు విడా స్కూటర్ల రిటైల్ అమ్మకాలు 3,00,458 యూనిట్లకు చేరాయి.

ఈవీ మార్కెట్ లో 11 శాత వాటా

ప్రస్తుతం ఇండియన్ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో విడా వేగంగా ఎదుగుతున్న బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. మార్కెట్ వాటాలో సుమారు 11 శాతం వాటాతో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ తర్వాత నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఓలా ఎలక్ట్రిక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లాంటి బ్రాండ్ల కంటే ముందంజలో ఉంది.

Advertisement

విడా అమ్మకాల వృద్ధి కూడా శరవేగంగా కొనసాగుతోంది. మొదటి లక్ష స్కూటర్ల అమ్మకాలకు దాదాపు 33 నెలలు పట్టింది. అయితే, లక్ష నుంచి రెండు లక్షల యూనిట్లకు చేరుకోవడానికి కేవలం ఏడు నెలల సమయం మాత్రమే పట్టింది. ఇక రెండు లక్షల నుంచి మూడు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడానికి కేవలం ఐదు నెలలే పట్టడం, మార్కెట్లో విడా స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

అమ్మకాల్లో కొత్త రికార్డులు

ఈ ఏడాది విడా నెలవారీ అమ్మకాలలో కూడా కొత్త రికార్డులు నమోదు చేసింది. జూన్‌లో 21,893 యూనిట్లు విక్రయించగా, జూలైలో ఆ సంఖ్య 22,883 యూనిట్లకు చేరి కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలుగా నమోదైంది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో రెండు లక్షలకు పైగా స్కూటర్లను విక్రయించే దిశగా కంపెనీ దూసుకెళ్తోంది. 2026 చివరి నాటికి మొత్తం అమ్మకాలు సుమారు 2.25 లక్షల నుంచి 2.35 లక్షల యూనిట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

విడా సక్సెస్ కు కారణం ఏంటి?

Advertisement

విడా సక్సెస్ కు ప్రధాన కారణాల్లో ఒకటి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ విధానం. ఈ మోడల్‌ లో వినియోగదారులు బ్యాటరీని వేరుగా తీసుకునే అవకాశం ఉండటంతో స్కూటర్ ప్రారంభ ధర తగ్గుతుంది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మరింత అందుబాటులోకి వచ్చింది. ఈ విధానాన్ని తర్వాత ఇతర కంపెనీలు కూడా ఫాలో అయ్యాయి.  మార్కెట్ విస్తరణపై కూడా హీరో మోటోకార్ప్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 415 నగరాల్లో, 700కు పైగా డీలర్ల ద్వారా, మొత్తం 900కు పైగా టచ్‌ పాయింట్లతో విడా సర్వీసులు అందిస్తోంది. వినియోగదారుల సౌకర్యం కోసం దేశ వ్యాప్తంగా 5,900కు పైగా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏథర్ గ్రిడ్ నెట్‌వర్క్‌ను కూడా విడా కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా విడా ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశ వ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న మార్కెట్ వాటా, కొత్త అమ్మకాల రికార్డులు, డీలర్ నెట్‌ వర్క్ విస్తరణ, ఛార్జింగ్ సౌకర్యాలు, ఉత్పత్తి సామర్థ్య పెంపు లాంటి అంశాలు విడా సక్సెస్ కు బలోపేతం కానున్నాయి.

Read Also: ఈ హెల్మెట్లు పెట్టుకుంటే.. జుట్లు రాలే సమస్యలే ఉండవట, వెంటనే కొనేయండి!

Tags

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×