IND Vs PAK : ఆసియా కప్ 2025 ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్ లు ముగిసిపోయాయి. ఇక సూపర్ 4లో కూడా రెండు మ్యాచ్ లు జరిగాయి. అంటే సూపర్ 4లో నాలుగు జట్లు తలపడ్డాయి. తొలి సూపర్ 4 మ్యాచ్ లో శ్రీలంక, రెండో సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి చెందగా.. తొలి సూపర్ 4 లో బంగ్లాదేశ్, రెండో సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించాయి. దీంతో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తప్పకుండా మిగతా రెండు మ్యాచ్ లు గెలవాలి. ఇక ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి చెందిన ఓ అమ్మాయి సంచన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో పాకిస్తాన్ ఓడిపోతే.. ఆ అమ్మాయి మాత్రం టీమిండియా ఇక ఇంటికి వెళ్లిపోవాలని పేర్కొనడం గమనార్హం.
Also Read : IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంకర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !
ముఖ్యంగా పాకిస్తాన్ ఇవాళ శ్రీలంక, తరువాత బంగ్లాదేశ్ మ్యాచ్ తో గెలిస్తే.. ఫైనల్ లో భారత్ తో తలపడే అవకాశం ఉంది. కానీ అది అంత తేలికగా జరిగే పని కాదు అని తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించింది. దీంతో శ్రీలంక ఓటమి చెందామనే కసితో ఉంది. కాబట్టి ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠతో జరుగనుందని స్పష్టంగా అర్థం అవుతుంది. మరోవైపు శ్రీలంక గెలిస్తే.. బంగ్లాదేశ్ కచ్చితంగా ఫైనల్ కి వెళ్లే అవకాశం లేకపోలేదు. మూడు జట్లలో రన్ రేట్ మెరుగ్గా జట్టు నేరుగా ఫైనల్ కి అర్హత సాధిస్తుంది. ఈసారి అదే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. పాకిస్తాన్ పై శ్రీలంక, బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ విజయం సాధిస్తే.. టీమిండియా ఎలాగో ఫైనల్ కి చేరుకుంటే.. మూడింటిలో మెరుగ్గా రన్ రేట్ ఉన్న జట్టు మాత్రమే ఫైనల్ కి చేరుకుంటుంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియాను ఫైనల్స్ లో ఓడించాలనే ధీమాతో ఉన్నారు. అందుకే ఫైనల్ నుంచి టీమిండియా ఇంటికి పోవాలని ఓ యువతి పేర్కొంటుంది. కానీ అది జరిగే పని కాదు.. శ్రీలంక లేదా బంగ్లాదేశ్ జట్లలోనే ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. మరోవైపు ఇవాళ శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం పైనే పాకిస్తాన్ ఫైనల్ కి చేరేది చేరనిది తెలుస్తోంది. శ్రీలంక జట్టు పాకిస్తాన్ జట్టుకంటే కూడా చాలా బలంగా కనిపిస్తోంది. మరీ పాకిస్తాన్ జట్టు శ్రీలంకను ఏవిధంగా ఢీ కొంటుందో చూడాలి. ఇక టీమిండియా ఇప్పటికే పాకిస్తాన్ జట్టును ఓడించి ముందంజలో ఉంది. మిగతా రెండు మ్యాచ్ ల్లో కూడా విజయం సాధిస్తుంది. కేవలం ఒక్క మ్యాచ్ గెలిస్తే.. టీమిండియా ఫైనల్ కి చేరుకున్నట్టే.. రన్ రేట్ పరంగా టీమిండియా కాస్త ముందంజలోనే ఉంటుంది. ఇవాళ జరిగే పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఉత్కంఠను రేకిత్తిస్తుంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==