Shahid Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టుకు కొత్త ఓనర్ వచ్చేశారు. ఈ బెంగుళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ తో ( Aditya Birla Group) పాటు మరో మూడు సంస్థలు కొనుగోలు చేశాయి. దాదాపు రూ.16,700 కోట్లు పెట్టి, డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశాయి. అయితే ఈ సేల్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) స్పందించారు. బెంగళూరు జట్టుకు భారీ ధర వచ్చిన నేపథ్యంలో ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు లక్ష రూపాయలు ఎక్కువ అంటూ సెటైర్లు పేల్చారు. ఇప్పుడే జేబులో నుంచి లక్ష రూపాయలు ముఖాన కొడతా.. వెంటనే బెంగళూరు జట్టును తనకు విక్రయించాలని దారుణంగా కామెంట్లు చేశారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ భారీ ధరకు కొనుగోలు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) దారుణంగా ట్రోలింగ్ చేశాడు. 16 వేల కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేస్తే, కేవలం 16 వేల రూపాయలకు కొన్నారా ? అంటూ లెక్కలు తెలియకుండా మాట్లాడారు షాహిద్ ఆఫ్రీది. విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్లు ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 వేలు మాత్రమే పలికిందా ? అంటూ సెటైర్లు పేల్చారు.
తనకు చెప్పి ఉంటే లక్ష రూపాయలు ముఖాన కొట్టేవాడిని.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును సొంతం చేసుకునే వాడిని అంటూ ర్యాగింగ్ చేశారు. బెంగళూరు జట్టుకు ఇంత తక్కువ ధర పలకడం దారుణం అంటూ షాహిద్ ఆఫ్రీది వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. కోట్లకు వేలకు తేడా తెలియకుండా షాహిద్ ఆఫ్రీది మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను చక్కదిద్దుకో, అనవసరంగా ఐపిఎల్ లో వేలు పెట్టకు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు బెంగళూరు అభిమానులు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టు ఆదిత్య బిర్లా గ్రూప్ మెజారిటీ షేర్లు కొనుగోలు చేసింది. దీంతో ఆదిత్య బిర్లా గ్రూప్ ఓనర్ ఆర్యమాన్ బిర్లా ఆర్సీబీ జట్టుకు ఛైర్మన్‌గా మారబోతున్నారు. అటు TOI గ్రూప్ (సత్యన్ గజ్వానీ ), బ్లాక్‌స్టోన్ (ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం),
డేవిడ్ బ్లిట్జర్ (బోల్ట్ వెంచర్స్) సహ యజమానులుగా కొనసాగుతారు.