BigTV English

Shock for Sindhu.. Saina, Lakshya Sen in 2nd round.. :సింధుకు షాక్.. సైనా, లక్ష్యసేన్ ముందంజ..

Shock for Sindhu.. Saina, Lakshya Sen in 2nd round.. :సింధుకు షాక్.. సైనా, లక్ష్యసేన్ ముందంజ..

Shock for Sindhu.. Saina, Lakshya Sen in 2nd round.. :భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు కొత్త ఏడాది తొలి టోర్నీయే కలిసిరాలేదు. ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో అయిదో సీడ్‌ సింధు… 14-21, 20-22 తేడాతో థాయిలాండ్ షట్లర్, అన్‌సీడెడ్‌ సుపనిదా కతాంగ్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మ్యాచ్‌లో తొలి గేమ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సుపనిద..


సింధుకు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. 6-2తో ముందంజ వేసిన థాయ్‌ షట్లర్… విరామ సమయానికి 11-4తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్‌ తర్వాత సింధు తన శైలిలో స్మాష్‌లు, క్రాస్‌ కోర్ట్‌ విన్నర్లతో పాయింట్లు సాధించి… 14-17తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ పట్టువదలని సుపనిద… వరుసగా 4 పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది

రెండో గేమ్‌లో సింధు గట్టిగా పోరాడింది. విరామ సమయానికి సుపనిద 11-9తో ఆధిక్యంలో ఉన్నా… సింధు నెమ్మదిగా పుంజుకుంది. ఒక దశలో 19-19తో పాయింట్లను సమం చేయడమే కాకుండా… 20-19తో ఆధిక్యంలోకి కూడా వెళ్లింది. కానీ కీలక సమయంలో తడబడిన సింధు… వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ చేజార్చుకుంది. గత టోర్నీలోనూ సింధు సెమీస్‌లో సుపనిద చేతిలోనే ఓడిపోయింది.


ఇక మరోస్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌… ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సైనా 21-17, 12-21, 21-19తో డెన్మార్క్ షట్లర్ మియా బ్లిక్‌ఫెల్డ్‌పై గెలిచింది. తొలి గేమ్‌ను సైనా కష్టపడి గెలిచాక.. రెండో గేమ్‌లో విజృంభించిన మియా… ఈజీగా మ్యాచ్‌ గెలిచేలా కనిపించింది. కానీ మూడో గేమ్‌లో పుంజుకున్న సైనా.. హోరాహోరీగా తలపడింది. గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకుని రెండో రౌండ్లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లక్ష్యసేన్‌ కూడా టోర్నీలో సెకండ్ రౌండ్ చేరుకున్నాడు. తొలి రౌండ్లో 21-14, 21-15 పాయింట్ల తేడాతో సహచర ఆటగాడు ప్రణయ్‌ను ఓడించాడు… లక్ష్యసేన్.

Follow this link for more updates :- Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×