E-Paper
Advertisement

Bandi Sanjay: రౌడీ బండి?.. కచ్చా డాగ్!.. అంతా కేసీఆరే కుట్రేనా?

Bandi Sanjay: రౌడీ బండి?.. కచ్చా డాగ్!.. అంతా కేసీఆరే కుట్రేనా?
Advertisement

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ బహదూర్‌పల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతోన్న భగీరథ్ తోటి విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.

అయితే భగీరథ్ చేతిలో దాడికి గురైన విద్యార్థి ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ.. ‘‘భగీరథ్ స్నేహితుడి చెల్లెలిని ఇబ్బంది పెట్టాను. అందుకే భగీరథ్ నాపై చేయి చేసుకున్నాడు. ఆతర్వాత మీమంతా కలిసిపోయాము’’ అంటూ వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Advertisement

ఈ వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్.. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలని, పిల్లల జీవితాలతో ఆడుకోవడం సరికాదని వెల్లడించాడు. సీఎం కేసీఆర్‌కు తనతో రాజకీయం చేసే దమ్ములేక తన కొడుకును లాగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మనువడి విషయంలో కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తాను ఖండించినట్లు గుర్తు చేశారు. తప్పు చేశానని దెబ్బలు తిన్న విద్యార్థే ఒప్పుకున్నాక కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతావా? అంటూ ధ్వజమెత్తారు. బాధిత యువతి, తన కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

Related News

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

Big Stories

Advertisement
×