Shubman Gill – Kohli : లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టీమ్ ల మధ్య మూడో టెస్టు ఆసక్తికరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్లూ సమంగా స్కోర్లు 387 సాధించాయి. అయితే మూడో రోజు ఆట ముగింపు సమయంలో పెద్ద డ్రామానే నడిచింది. లార్డ్స్ టెస్టులో అగ్గి రాజుకుంది అనే చెప్పాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ సరిగ్గా 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆ తరువాత ఇంగ్లాండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. బుమ్రా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ బరిలోకి దిగారు. ఓవర్ ను త్వరగా పూర్తి చేసి మరో ఓవర్ వేయాలనని భారత బౌలర్లు భావించారు. కానీ జాక్ క్రాలీ మాత్రం మూడో రోజుకు ఇదే చివరి ఓవర్ గా చేయాలనే విధంగా ప్రవర్తించాడు.
Also Read : Shubman Gill-ICC : బండ బూతులు తిట్టిన గిల్…ICC సీరియస్.. మ్యాచ్ ఆడకుండా వేటు పడనుందా?
క్రాలీ-గిల్ మధ్య వివాదం..
మధ్యలో కావాలని సమయాన్ని వృధా చేశాడు. బౌలర్ బుమ్రా తో పాటు గిల్ సహా భారత ఆటగాళ్లలో అసహనం వ్యక్తం చేశారు. మూడో బంతికి క్రాలీ కావాలని వికెట్ల నుంచి దూరంగా వెళ్లాడు. ఆ తరువాత ఐదో బంతి క్రాలీ చేతిని తాకింది. వెంటనే గ్లౌవ్స్ తీసేసి డగౌట్ లోని ఫిజియోను పిలిచాడు. మరోసారి భారత ప్లేయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్ దృష్టికి తీసుకెళ్లారు. బుమ్రా తో పాటు ఆటగాళ్లంతా చప్పట్లు కొడుతూ క్రాలీని అభినందించడం గమనార్హం. ఈ సమయంలో కెప్టెన్ గిల్ క్రాలీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతి వేళ్లను మరోలా చూపిస్తూ బండ బూతులు తిట్టాడు. దీనిపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. గతంలో టీమిండియా కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు.
విరాట్ కోహ్లీ కూడా..
విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టోతో ఇలాంటి వివాదమే జరిగింది. ఇక ఇప్పుడు గిల్ కూడా సోషల్ మీడియాలో అప్పుడు విరాట్ కోహ్లీ.. ఇప్పుడు శుబ్ మన్ గిల్ ఇద్దరూ ఏమాత్రం తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ 2021లో ఇంగ్లాండ్ జట్టుతో మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా జట్టు పై కూడా ఇలాంటి వివాదం పెట్టుకున్నాడు. మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీ.. ఆసీస్ ఆరంగేట్ర ఆటగాడు సామ్ కాన్ స్టాస్ మధ్య వివాదం జరిగింది. కాన్ స్టాస్ ను విరాట్ కోహ్లీ తన భుజంతో బలంగా ఢీ కొన్నాడు. వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. జరిమానాతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ కూడా విరాట్ ఖాతాలో పడింది. గిల్ పై సస్పెన్షన్ వేటు పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.