BigTV English

AP EAPCET-2025: ఏపీలో EAPCET-2025 వెబ్ ఆప్షన్ల ఎంపిక.. 22 నుంచి

AP EAPCET-2025: ఏపీలో EAPCET-2025 వెబ్ ఆప్షన్ల ఎంపిక.. 22 నుంచి

AP EAPCET-2025: ఏపీలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ ఆప్ష న్ల ప్రక్రియ మొదలైంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతోంది. ఈ ప్రక్రియ జూలై 16తో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు నేటి నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.


దీనికి జూలై 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు అధికారులు. అర్హులైన అభ్యర్థులు జులై 18 లోపు అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. జూలై 19న వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఏమైనా మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది.

జూలై 22న విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందే అభ్యర్థులు జూలై 23న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూలై 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆగస్టు నాలుగు నుంచి తరగతులు మొదలు కానున్నాయి.


కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ కింద ఓసీ/బీసీ విద్యార్థులకు రూ. 1200.. అదే ఎస్సీ/ఎస్టీ వారికి రూ. 600 గా నిర్ణయించారు అధికారులు. కౌన్సెలింగ్‌కు వెళ్లే స్టూడెంట్స్ కచ్చితంగా ఏపీ ఈఏపీసెట్ ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించాలి. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులుంటే స్టూడెంట్స్ ఆయా ఫోన్ 7995681678, 7995865456, 9177927677 నెంబర్లను సంప్రదించవచ్చు.

ALSO READ: సీఎం చంద్రబాబు.. హెయిర్ వ్యవహారం, రేపోమాపో నిర్ణయం

ఏపీ వ్యాప్తంగా ఈఏపీసెట్ పరీక్షలు మే 19-27 వరకు జరిగాయి. మే 19-20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగ్గా,21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ఆన్‌లైన్‌‌లో జరిగాయి. అదే నెల 27న అగ్రికల్చర్‌, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేసింది. మరుసటి రోజు అంటే మే 28న ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీని విడుదల చేసింది.

మే 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ జరిగింది. జూన్ 8న ఫలితాలను విడుదల చేసింది. ఇంజినీరింగ్ విభాగంలో 2,64,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో లక్షా 89,748 మంది అర్హత సాధించారు. 71.65 ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. వాపైన విద్యార్థులు సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 81,837 మంది దరఖాస్తు చేసుకున్నారు. 75,460 మంది అభ్యర్థులు హాజరుకాగా, 67,761 మంది విజయం సాధించారు. మొత్తం 89 శాతం పైగానే క్వాలిఫై అయ్యారు.

Related News

TTD Warning: టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై కేసుల నమోదు.. కటకటాలే!

Visakhapatnam: వైజాగ్‌కు టీసీఎస్ వచ్చేసింది.. 2000 మందితో త్వరలోనే..?

Pawan Kalyan Gifts: టీచర్స్ డే.. అదిరిపోయే కానుక ఇచ్చిన పవన్.. అదేమిటంటే?

Deepam-2 Scheme: ఏపీ గిరిజనులకు బంపర్ గిఫ్ట్.. చిన్న సిలిండర్‌కు గుడ్‌బై.. పెద్ద సిలిండర్‌తో ఫుల్ లాభం!

Disney World AP: అమెరికా నుంచి డైరెక్ట్ షిఫ్ట్.. డిస్నీ వరల్డ్ కోసం రెడీ అవుతున్న.. ఏపీలోని ఆ నగరం!

Vizag Updates: విశాఖకు స్పెషల్ గెస్ట్ వచ్చేశారు.. అలా వెళ్లి ఇలా చూసి రండి!

Big Stories

×