BigTV English

Shubman Gill-ICC : బండ బూతులు తిట్టిన గిల్…ICC సీరియస్.. మ్యాచ్ ఆడకుండా వేటు పడనుందా?

Shubman Gill-ICC : బండ బూతులు తిట్టిన గిల్…ICC సీరియస్.. మ్యాచ్ ఆడకుండా వేటు పడనుందా?

Shubman Gill-ICC :  లార్డ్స్ వేదిక గా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే తొలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్, భారత్ రెండు జట్లు కూడా 387 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. భారత్ ఆలౌట్ కాగానే ఇంగ్లాండ్ ఒక ఓవర్ బ్యాటింగ్ చేసింది.  ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఓపెనర్ బ్యాటర్ క్రాలీ బ్యాటింగ్ చేశాడు. తొలి బంతి డాట్ కాగా.. బుమ్రా బౌలింగ్ లో రెండో బంతికి రెండు పరుగులు చేశాడు. మూడో బంతిని బుమ్రా బాల్ వేసేందుకు పరుగుత్తుకుంటూ వస్తుండగా.. వికెట్ల వద్దకు రాగానే క్రాలీ పక్కకు జరిగాడు. దీంతో బుమ్రా ఆ బంతిని వేయలేదు. ఆ తరువాత వేసిన బంతులన్నీ కూడా డాట్ బాల్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే గిల్ ఇంగ్లాండ్ బ్యాటర్లను బండ బూతులు తిట్టాడు. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Also Read : Mohammed Siraj : కొత్త అమ్మాయితో మహమ్మద్ సిరాజ్.. లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడుగా !

క్రాలీ పై గిల్ సెన్షేనల్ కామెంట్స్.. 


అందులో ముఖ్యంగా క్రాలీ కి ఫ**కింగ్ ఆస్కార్ ఇవ్వండి అంటూ గిల్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇంగ్లాండ్ ఓపెనర్ బ్యాటర్లు ఇద్దరూ గిల్ పై కాస్త సీరియస్ అయ్యారు. కానీ అంపైర్లు వివాదం కాకుండా సద్దుమనిగించారు. ప్రధానంగా ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలే.. కాస్త ఓవర్ యాక్టింగ్ చేశాడనే చెప్పాలి. బుమ్రా బౌలింగ్ వేస్తున్నప్పుడు… ఏదో గాయమైనట్లు వికెట్లను వదిలేశాడు. దాంతో… బంతి వేయకుండానే వెన్నుతిరిగాడు. ఈ నేపథ్యంలో గిల్ కాస్త సీరియస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత… ఐదవ బంతి పడగానే చేతికి గాయమైనట్లు క్రాలే… ఫిజియోథెరపిస్టును పిలిపించుకున్నాడు. ఒక్క ఓవర్ కే మీరు ఓవర్ చేస్తున్నారు…  కనీసం ఐదు ఓవర్లు పడేవి అంటూ క్రాలేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గిల్. అంతేకాదు.. తన చూపుడు వేలుతో.. బండ బూతులు తిడుతూ హెచ్చరించాడు. ఆ తర్వాత రెండు చేతులు చూపిస్తూ చాలా వ్యంగంగా.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ర్యాగింగ్ చేశాడు. ఇక పీసుక్కోండి అంటూ… అసభ్యకరంగా చేతులను చూపించాడు.

గిల్ పై యాక్షన్ ఉంటుందా..?

దీంతో గిల్ పై ఈ ఇన్సిడెంట్ నేపథ్యంలో గిల్ పై యాక్షన్ ఉంటుందా..? అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. మరోవైపు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఫొటో చూడలేదు. ఈ ఫొటో చిరకాలం నిలిచిపోతుందని నెటిజన్లు గిల్ పై కామెంట్స్ చేయడం విశేషం. లార్డ్స్ మైదానంలో మూడు రోజుల ఆట ముగిసింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అయితే సరిగ్గా ఇంగ్లాండ్ చేసిన స్కోర్ ను భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో చేసింది. ముఖ్యంగా మూడు రోజుల మ్యాచ్ జరిగినా ఎవ్వరూ పై చేయి సాధిస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మ్యాచ్ డ్రా జరుగుతుందా..? లేక రెండింట్లో ఏ జట్టు అయినా విజయం సాధిస్తుందా..? అనేది ఇవాళ మ్యాచ్ జరిగిన తరువాత ఓ అంచెనా కు వచ్చే అవకాశం ఉంది. ఇరు జట్లు కూడా తమ ప్రతిభ ను కనబరిచాయి. హోరా హోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ లో శుబ్ గిల్  చేసిన కామెంట్స్ కి మ్యాచ్ ఆడకుండా వేటు పడుతుందా..?  ఐసీసీ చర్యలు తీసుకోనుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

?igsh=cTBvMGJmcGcwem5z

Related News

Mornie Morkel : పాకిస్తాన్ వీక్నెస్ మాకు తెలుసు.. వాళ్లను చావు దెబ్బ కొడతాం… టీమిండియా కోచ్ వార్నింగ్

Sachin-Sara : సచిన్ కు షాక్… సంపాదనలో తండ్రిని దాటిన సారా టెండూల్కర్.. ఒక్క పోస్టుకు ఎంత రేటు అంటే

Harbhajan Singh : భ‌జ్జీ రియ‌ల్ హీరో…వ‌ర‌ద బాధితుల కోసం భారీ సాయం..3 అంబులెన్సులు కూడా

Rishab Pant : చిన్నపిల్లడిలా కటింగ్ చేయించుకున్న పంత్… టీమిండియాలోకి రీ ఎంట్రీ అప్పుడే..

Rohit Sharma: ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ…ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..అస‌లు ఏమైంది

Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

×