BigTV English

Shubman Gill: మూడో టీ20 మ్యాచ్, గిల్ దూరం!

Shubman Gill: మూడో టీ20 మ్యాచ్, గిల్ దూరం!

Shubman Gill latest news(Cricket news today telugu): శ్రీలంక-టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ మంగళవారం జరగనుంది. మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది సూర్యకుమార్ సేన. సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అయితే ఈ మ్యాచ్‌కు జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ దూరంగా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.


ఇటీవల ప్రాక్టీసు చేస్తున్న సమయంలో శుభ్‌మన్ గిల్‌కు మెడ పట్టేసింది. దీంతో ఆయన ఇబ్బందిపడుతు న్నాడు. ఇంకా కోలుకోలేదని, మరింత సమయం పట్దవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌ కు అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. సెకండ్ మ్యాచ్‌కు గిల్ ప్లేస్‌లో సంజుశాంసన్‌ బరిలోకి దిగాడు. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

సెకండ్ మ్యాచ్‌కు గిల్ ప్లేస్‌లో సంజు శాంసన్ బరిలోకి దిగాడు. త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని గిల్‌కు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన చేస్తోంది. వచ్చేనెల ఆగష్టు రెండు నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. గిల్ ఆటతీరుపై క్రికెట్ ప్రేక్షకులు మాత్రం ఆగ్రహంగానే ఉన్నారు. ఆయన ఆటతీరును అంచనా వేసిన అభిమానులు, టీ20ల కంటే వన్డేల్లో బెటరని అంటున్నారు.


ALSO READ: నేడే ఆఖరి టీ 20.. భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందా?

కొద్దిరోజులుగా తన ఆటతీరు బాగాలేదని గిల్ ఓపెన్‌గా చెప్పేశాడు. ఈ క్రమంలో కొద్దిరోజులు ఆయనను టీ20లకు దూరంగా పెడితే బెటరన్నది అభిమానుల భావన. గిల్ మిడిలార్డల్‌లో దిగితే జట్టుకు మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. టీమిండియాకు మరో వాల్‌గా ఉంటాడని అంటున్నారు. అసలే రోజురోజుకూ టీమిండియాలో ప్లేస్ కోసం ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో గిల్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.

Related News

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Big Stories

×