E-Paper
Advertisement

Smriti Mandhana : అస‌లు నాకు ఇష్ట‌మే లేదు, కానీ బ‌ల‌వంతంగా..స్మృతి సంచ‌ల‌నం !

Smriti Mandhana : అస‌లు నాకు ఇష్ట‌మే లేదు, కానీ బ‌ల‌వంతంగా..స్మృతి సంచ‌ల‌నం !
Advertisement

Smriti Mandhana :  భార‌త మ‌హిళా స్మృతి మంధాన గురించి దాదాపు అంద‌రికీ తెలిసిందే. ఈ మ‌ధ్య ఆమె పెళ్లి ర‌ద్దు కావ‌డంతో వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే ఆమె పెళ్లి ర‌ద్దు అయిన త‌రువాత ఓ స‌మ్మిట్ లో పాల్గొని మాట్లాడారు. ఆమె చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. క్రికెట్ కంటే త‌న‌కు ఇష్ట‌మైన‌ది ఏది లేద‌ని తెలిపింది. టీమిండియా జెర్సీ ధ‌రించ‌డ‌మే త‌న‌కు అతిపెద్ద ప్రేర‌ణ అని తెలిపారు. స‌మ‌స్య‌లు అన్నీ ప‌క్క‌న పెట్టి జీవితం పై దృష్టి సారించ‌డానికి అదే సాయ‌ప‌డుతుంద‌ని చెప్పారు. కొన్నేళ్లుగా చేసిన పోరాటానికి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌తిఫ‌లమ‌ని చెప్పారు.

Also Read : Rohit Sharma: రోహిత్ శ‌ర్మ ఫ్యామిలీతో చిల్ అవుతున్న అల్లు హీరో..పెళ్లికి పిలుస్తున్నాడా ఏంటి?

భార‌త జెర్సీ ధ‌రించ‌డం నాకు స్పూర్తినిస్తుంది

Advertisement

ప‌లాష్ ముచ్చ‌ల్ తో వివాహం ర‌ద్దు చేసుకున్న త‌రువాత టీ మ్ ఇండియా ఉమెన్స్ జ‌ట్టు వైస్ కెప్టెన్ తొలిసారిగా బ‌య‌ట క‌నిపించింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మందిరా బేడితో జ‌రిగిన టాక్ షో లో స్మృతి పాల్గొన్న‌ది. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. భార‌త జెర్సీ ధ‌రించ‌డం నాకు స్పూర్తిని ఇస్తుంది. నా చింత‌ల‌న్నింటిని తొల‌గిస్తుంది. జెర్సీ ధ‌రించిన త‌రువాత మీపై బాధ్య‌త‌లు ఉన్నందున మీకు ఉన్న స‌మ‌స్య‌ల‌న్నింటినీ ప‌క్క‌న పెట్టాల‌ని.. ఎప్పుడూ అంద‌రికీ చెబుతాను. మీరు ల‌క్ష‌లాది మందికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మీరు మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం పై దృష్టిపెడితే స‌రిపోతుంది అని తెలిపింది. జట్టులో విభేదాలు ఉన్నాయా? ఉంటే వాటిని ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించ‌గా..? దానికి స్మృతి స్పందిస్తూ.. ‘ఈ ప్రశ్న అడిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్న. జట్టులోని ప్రతి ఒక్కరూ జట్టులోని ప్రతి ఒక్కరూ దేశం కోసం మ్యాచులు గెలవాలని కోరుకుంటున్నందున ఎలాంటి సమస్యలు లేవని నేను అనుకుంటున్నాను.

ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయం ఉంటుంది

ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ వారి సొంత అభిప్రాయం ఉంటుంది. మనం ఏదైనా విషయంలో విభేదిస్తే దేశం గెలవడానికి కట్టుబడి లేమన్నదాన్ని చూపిస్తుంది’ అంటూ స్మృతి చెప్పింది. జట్టులో డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చలు జరుగుతాయని.. కానీ వాటిని చర్చ అని పిలువనని.. మనం ప్లేయింగ్‌ లెవెన్‌ని ఎంచుకొని.. ముందుగా బ్యాటింగ్‌ చేయాలా ? లేదా బౌలింగ్‌ చేయాలా? అని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని.. మ్యాచ్‌ను ఎలా గెలవాలన్న దానిపై ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయం ఉంటుందని.. అలాంటి చర్చలు వాదనలుగా మారటాన్ని నేను ఎప్పుడూ చూడలేదని తెలిపింది. తాను హర్మన్‌ప్రీత్ వద్దకు వెళ్లి ఇలా చేయాలని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని.. తాము ఒకరి అభిప్రాయాలకు ఒకరు నో చెప్పగలిగేంత సంబంధం మాకు ఉంది అంటూ స్మృతి మంధాన‌ చెప్పుకొచ్చింది.

Advertisement

Also Read : BCCI: రిటైర్మెంట్ వయస్సులో కోహ్లీ, రోహిత్ వ‌ర్మ‌కు A+ గ్రేడ్‌..బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఎన్ని కోట్లు వ‌స్తాయంటే ?

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×