Akmal brothers: పాకిస్తాన్ కి చెందిన 43 ఏళ్ల కమ్రాన్ అక్మల్, అతడి సోదరుడు ఉమర్ అక్మల్ కి చెందిన లాహోర్ లోని ఫామ్ హౌస్ లో దొంగలు పడ్డారు. పట్టపగలే ఇంట్లోకి చొరపడ్డ దొంగలు రూ. 5 లక్షల విలువ చేసే సౌర విద్యుత్ పలకలను దోచుకెళ్ళారు. అంతకు ముందు రోజే ఈ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, ఈ సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసి ఒక్కరోజు కూడా గడవకుండానే దొంగలు దోచేశారని కమ్రాన్ అక్మల్ {Akmal brothers} తండ్రి వాపోయారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఈ ఘటన తెలిసిన క్రీడాభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాకిస్తాన్ లో సెలబ్రిటీ {Akmal brothers} ఇళ్లకు సైతం భద్రత కొరవడిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే లాహోర్ లోని వీరి ఫామ్ హౌస్ లో ఇలా దొంగతనం జరగడం కొత్తేమీ కాదు. 2022 జూలై నెలలో కూడా ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ ఇంట్లో దొంగలు పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో నుండి మేకను ఎత్తుకెళ్లారు.
దాని విలువ 90 వేల రూపాయలు. బక్రీద్ సందర్భంగా పేదలకు దానం ఇవ్వడానికి మేకలను కొనుగోలు చేశారు అక్మల్ కుటుంబ సభ్యులు. పండగని పురస్కరించుకొని మొత్తం ఆరు మేకలను కొనుగోలు చేసి, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి ఆవరణలో కట్టేశారు. ఆ తరువాత అందులో ఒకటి కనిపించడం లేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని {Akmal brothers} తెలిపారు. ఇలా లాహోర్ లోని అక్మల్ నివాసంలో చోరీ జరగడం ఇది రెండవసారి. ఇక కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడారు.
తన కెరీర్ లో 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ గా పాకిస్తాన్ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం డొమెస్టిక్ లీగ్ మ్యాచ్లలో పాల్గొంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} టోర్నిలోనూ మెరిశాడు. 2008 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరు మ్యాచ్లలో ఆడాడు కమ్రాన్. ఈ ఆరు మ్యాచ్లలో ఒక ఆఫ్ సెంచరీ తో సహా 128 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ లోనే టోర్నీ నుండి తప్పుకున్న పాకిస్తాన్ జట్టు.. తాజాగా కరాచీ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన టి-20 మ్యాచ్ లో సైతం ఘోర ఓటమిని చవిచూసింది.
ఈ ఓటమిపై కమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జింబాబ్వే – ఐర్లాండ్ మధ్య సిరీస్ జరుగుతుందని.. అక్కడికి వెళ్లి వారితో ఆడి తిరిగి దేశానికి రావాలని పాకిస్తాన్ జట్టుపై సెటైర్లు వేశాడు. వారిపై గెలిస్తేనే పాకిస్తాన్ జట్టుకు ఛాంపియన్ ట్రోఫీలో ఆడే అర్హత వస్తుందని కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా గత ఏడు సంవత్సరాలుగా తమ జట్టు ప్రదర్శన చాలా చెత్తగా ఉందని మండిపడ్డాడు.