BigTV English

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ రివర్స్.. భద్ర చెప్పిన నిజాన్ని నమ్మేస్తుందా..?

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ రివర్స్.. భద్ర చెప్పిన నిజాన్ని  నమ్మేస్తుందా..?

Illu Illalu Pillalu Today Episode March 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. రామ రాజు ప్రేమను పిలిచి జాబ్ చెయ్యొద్దని అంటాడు. కానీ ఆ మాటను వినదు. నేను జాబ్ చేసే సంపాదించుకొని తింటాను అనేసి అంటుంది. కానీ ధీరజ్ మా నాన్న మాటలకు ఎదురు చెప్తావు నువ్వు అని లోపల పంపిస్తాడు. ఇక ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్రేమతో నువ్వు జాబ్ చేయొద్దు నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను జాబ్ చేసి నిన్ను పోషించుకోవాలి మా నాన్న అన్నదే నిజం కదా నేను నిన్ను పోషించే ధైర్యం దమ్ము ఉన్న వాళ్ళని కచ్చితంగా నేను నిన్ను పోషిస్తాను నువ్వు జాబ్ మానేసి అంటాడు. అని ప్రేమ మాత్రం నేను మా ఇంట్లో ఎలా పెరిగాను నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని నేను ఇలా తినలేను నువ్వు తింటావేమో గాని అని అంటుంది. నువ్వు జాబ్ చేయొద్దు నేను జాబ్ చేసి నిన్ను పోషించుకుంటాను ఈరోజు గనక జాబ్ రాకపోతే కచ్చితంగా నువ్వు వెళ్లి మళ్లీ నీ జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని ధీరజ్ అంటాడు. నువ్వు జాబ్ చేసి ఇప్పటికే మా నాన్న పరువు తీసావు ఇకమీదట నువ్వు జాబ్ చేయడానికి వీలు లేదు ఈరోజు గనక నేను జాబ్ తెచ్చుకోకపోతే ఇష్టం వచ్చిన చేసుకోపో అని ధీరజ్ ప్రేమను హెచ్చరిస్తాడు. ఇక ధీరజ్ జాబ్ కోసం కొన్ని షాపుల వెంట తిరుగుతాడు. చివరికి వాటర్ క్యాన్లు వేసే జాబ్లో జాయిన్ అవుతాడు. బుజ్జమ్మ ఎంత మాట్లాడాలని ట్రై చేసిన కూడా ధీరజ్ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పోషించుకోవడానికి ధీరజ్ కష్టపడి నీళ్లు మోస్తుంటాడు. ఆ తర్వాత చందు పెళ్లిని రామరాజు ఫిక్స్ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ తన భర్త ధీరజ్ అన్న మాటలు, రామారాజు అన్న మాటలు తలచుకొని బాధ పడుతుంది. వాళ్ళ అన్న వాడిని వాడిని వదిలేసి మన ఇంటికి వచ్చేయి. నువ్వు అక్కడ కష్టపడటం ఇంట్లో వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇంత బతుకు బతికి హోటల్లో ఎంగిలికప్పులు వెతుక్కోవడం ఏంటి ప్రేమ నిన్నే రోజేనా మిమ్మల్ని చూసామా అని చెప్తాడు. తనకి ప్రేమ తన అన్నకు నిజం చెప్పలేక తన అన్న మాటలు వినలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమ తన మనసులోని బాధను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కూర్చోని బాధపడుతుంది. ఎందుకు ప్రేమ భాద పడుతున్నావు అని నర్మదా అడుగుతుంది. నేను ఒక నిజాన్ని దాచి అటు మా ఇంటి వాళ్లకి ఇటు వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఆ నిజాన్ని చెప్పలేక నాలో నేను కుమిలి పోతున్నాను ఇది ఎక్కడికి వెళ్తుందో నాకు అర్థం కావట్లేదని ప్రేమ బాధపడుతూ ఉంటుంది.

అటు భాగ్యం శ్రీవల్లి పెళ్లిని ఎలాగైనా రామరాజు చేతనే చేయించాలి అని అనుకుంటుంది. గుడిలో లగ్న పత్రిక రాయించడానికి రామరాజు ఫ్యామిలీ అటు భాగ్యం ఫ్యామిలీ ఇద్దరు గుళ్లోకి వస్తారు. ఇక శ్రీవల్లి లాంటి మంచి అమ్మాయి మనకెందుకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని రామరాజు అంటారు. ఇక భాగ్యం పెళ్లి అంతా వాళ్ళే చేసేలా ప్లాన్ చేస్తుంది. మా ఇంటి సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం పెళ్లి అమ్మాయి వాళ్ళు చేయించాలని రామరాజు అంటాడు.


అయితే భాగ్యం మాత్రం మా ఇంటి సాంప్రదాయం ప్రకారం మేము నిశ్చితార్థం మాత్రమే చేస్తాం ఆ తర్వాత పెళ్లి అబ్బాయి వాళ్ళు చేయాలని అంటుంది. కానీ రామరాజు బుజ్జమ్మ ఆలోచనలో పడతారు. ఎందుకు పెళ్లి చేయడానికి రామారావు ఒప్పుకున్న కూడా బుజ్జమ్మ మాత్రం ఒప్పుకోదు సాంప్రదాయం ప్రకారం వాళ్లే పెళ్లి చేయాలనేసి అంటుంది. ఇక భాగ్యం అడ్డంగా బుక్ అయిపోతుంది కక్కలేక పెళ్లి చేస్తానని ఒప్పుకుంటుంది.

భద్ర గుడికి వచ్చి చందు పెళ్లిని ఎలాగైనా ఆపే ప్రయత్నం చేస్తుంది. రామరాజు చిన్నకొడుకు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. డబ్బులు బంగారం కోసం ఇదంతా చేశాడని అంటుంది. మీ అమ్మాయిని కూడా ఇలానే నమ్మించి డబ్బులు కోసం ఇదంతా చేస్తారు. ఆ తర్వాత కప్పులు కడిగే పనికి పంపిస్తారు.. ఈ పెళ్లిని ఆపేస్తే బెటర్ అంటూ సలహా ఇస్తుంది. అది విన్న భాగ్యం ఈ విషయాల గురించి రామరాజుకు చెప్పాలని అనుకుంటుంది. ఆయన గారండి ఇప్పుడు నిజం తెలిసిందా ఆయన గుట్టు మన చేతుల్లో ఉంది దాన్ని విప్పాల్సిందే అని భాగ్యం అంటుంది.

ఈ విషయం ఎలాగైనా తేల్చుకోవాలని భాగ్యం ఆమె భర్త రామ్ రాజు మిల్లు కి వెళ్తారు. మీరు ఈ విషయాన్ని ఎందుకు దాచారు నగల కోసమే అమ్మాయిని ట్రాప్ చేసి మీ చిన్నబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా మీరు కూడా అదే చేశారా ఏంటి అని అడుగుతుంది. వాళ్లకి మాకు పాత కక్షలు ఉన్నాయి. అందుకే వాళ్ళు మా గురించి లేనిపోనివి చెప్తున్నారని రామరాజు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్ బయట నుంచి అన్నం తీసుకొచ్చి ప్రేమకిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Deepthi Manne: ప్రియుడిని పరిచయం చేసిన ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌ నటి!

Devara: దేవరకు గ్రహణం వీడింది.. ఎట్టకేలకు టీవీల్లోకి!

Telugu TV Serials: టీవీ సీరియల్స్ రేటింగ్..కార్తీక దీపం తో ఆ సీరియల్ పోటీ..?

Illu Illalu Pillalu Today Episode: నర్మద పై కలెక్టర్ ప్రశంసలు.. రామరాజు గౌరవాన్ని కాపాడిన కోడళ్లు.. ధీరజ్ ప్రేమకు ప్రపోజ్..

Nindu Noorella Saavasam Serial Today october 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి సవాల్‌కు ప్రతి సవాల్‌ విసిరిన మిస్సమ్మ  

Brahmamudi Serial Today October 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తనది నాటకం కాదని అపర్ణ, ఇంద్రాదేవికి చెప్పిన కావ్య

Intinti Ramayanam Today Episode: నిజం చెప్పిన పల్లవి.. ఇంట్లోంచి గెంటేసిన కమల్.. అవనికి అక్షయ్ క్షమాపణలు..

GudiGantalu Today episode: రచ్చ చేసిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయం..? కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..

Big Stories

×