UP VS RCB: క్రికెట్ అభిమానులంతా చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పైన దృష్టి పెడితే… ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మాత్రం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కారణంగా క్రికెట్ అభిమానులు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో అద్భుతాలే జరుగుతున్నాయి. తాజాగా… యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్ల మధ్య… రసవత్తర పోరు జరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఈ మ్యాచ్ నిలిచిపోనుంది. ఎందుకంటే ఇప్పటివరకు సూపర్ ఓవర్ ( Super Over) అవసరం ఏ జట్టుకు రాలేదు. ఇప్పటివరకు ఏ మ్యాచ్ లో… కూడా సూపర్ ఓవర్ అవకాశం రాలేదు. కానీ… సోమవారం రోజున జరిగిన యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య.. జరిగిన మ్యాచ్ లో తొలి సూపర్ ఓవర్ జరిగింది. ఈ ఉత్కంఠ భరితమైన సూపర్ ఓవర్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 9 పరుగుల లక్ష్యాన్ని కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… చేదించలేకపోయింది.
డిపెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును నాలుగు… పరుగులకే కట్టడి చేసింది యూపీ వారియర్స్. ఈ తరుణంలో… నాలుగు పరుగుల తేడాతో యూపీ వారియర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిరాశ చెందింది. ఇక అంతకుముందు మొదట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోని నిర్ణయిత ఇరువై ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ నేపథ్యంలోనే ఆర్సిబి కెప్టెన్ స్మృతి మందాన ఆరు పరుగులకే అవుట్ అయ్యారు. వైన్ హెడ్జ్ 57 పరుగులతో రాణించింది. ఇందులో నాలుగు బౌండరీలు అలాగే మూడు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో డేంజర్ ప్లేయర్ ఫెర్రీ.. మరోసారి అదరగొట్టింది. 56 బంతుల్లోనే 90 పరుగులు చేసి పెర్రి… రఫ్ ఆడించింది. ఈ తరుణంలోనే 180 పరుగులు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
ఇక ఈ లక్ష్యాన్ని యూపీ వారియర్స్ ఉమెన్స్ జట్టు కూడా చేదించే క్రమంలో… భారీగానే పోరాడింది. దీంతో నిర్ణయిత 20 ఓవర్లలో 180 పరుగులు సరిగ్గా చేసి మ్యాచ్ డ్రా చేసింది యూపీ వారియర్స్ టీం. యూపీ వారియర్స్ జట్టులో కిరణ్ 24 పరుగులు చేయగా.. దీప్తి శర్మ 25 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ చివరలో సోఫీ 33 పరుగులు… జట్టును కాపాడింది. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్ డ్రా అయింది. డ్రా కావడంతో సూపర్ ఓవర్ వరకు అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సూపర్ ఓవర్ లో యూపీ వారియర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలోనే ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు అంటే నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 మ్యాచ్లో విజయం సాధించి రెండు మ్యాచ్లో ఓడిపోయింది.. దీంతో నాలుగు పాయింట్లు సంపాదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రెండవ స్థానంలో ఉంది.
RCB FAILS TO CHASE 9 IN THE SUPER OVER. 🤯 pic.twitter.com/Pxp8vpLcmk
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2025