BigTV English

Central Govt: ఏపీ మిర్చీ రైతులకు మోదీ గుడ్ న్యూస్.. క్వింటాకు రూ.11,781 ధర

Central Govt: ఏపీ మిర్చీ రైతులకు మోదీ గుడ్ న్యూస్.. క్వింటాకు రూ.11,781 ధర

Central Govt: ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కీలక ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మిర్చి ధరలు, మిర్చి రైతుల సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌కి విన్నవించారు. మిర్చి ధర పెంపుతో పాటు ఎగుమతుల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత రెండు రోజుల క్రితం శివరాజ్ సింగ్ మిర్చిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీమ్ కింద మిర్చి రైతులను ఆదుకునే విషయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్. దీంతో పాటు.. కనీస మద్ధతు ధరపై కీలక నిర్ణయం తీసుకున్నారు.


ఈ తరుణంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. సీఎం చంద్రబాబు లేఖలకు సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్రం మద్దతు ధర కల్పించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మిర్చికి మద్దతు ధరను ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 రూపాయల మద్దతు ధరగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెలరోజుల పాటు ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. రూ.2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు కేంద్రం అవకాశం కల్పించింది. పండించిన పంటకు గిట్టుబాటు లేదంటూ ఏపీలో మిర్చి రైతులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్.. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదే టైంలో మిర్చి రైతుల గురించి సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లెటర్‌ రాసిన ఆయన.. ఏపీ మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. అలాగే మిర్చి రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించి, వారికి మేలు జరిగేలా చూడాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఆదేశించారు. దీంతో కేంద్రం వద్ద పెమ్మసాని ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రావటంతో కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు ధరను ప్రకటించింది. క్వింటా మిర్చి రూ.11,781గా నిర్ణయించింది.


Also Read: ఏఐ వినియోగం.. భారతీయ రైతుల అద్భుతాలు, సత్యనాదెళ్ల రిలీజ్

మరోవైపు మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు శనివారం సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. మిర్చి ధరల గురించి రైతులు, ఎగుమతిదారులతో సీఎం చర్చించారు. భారత్‌ నుంచి విదేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో.. మిర్చికి సరైన ధర దక్కేందు ఉన్న మార్గాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు మార్కెట్‌ యార్డ్‌లోని మిర్చి నిల్వల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రైతులను ఆదుకోవాలంటూ కేంద్రం వద్ద ప్రస్తావిస్తూ రావటంతో.. మిర్చి రైతులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కాగా ఇటీవల ఏపీలో మిర్చి ధరల పతనంపై మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తమ హయాంలో ఉన్న ధరలు.. ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలకు తేడా వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మిర్చి రైతులకు తగిన న్యాయం చేయడాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

Related News

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Big Stories

×