BigTV English

Telangana MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి?

Telangana MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి?

Telangana MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కమలనాథులు.. గెలుపు అంత సులభం కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటూ ఇటు అభ్యర్థులకు, అటూ కేడర్ కు దిశ నిర్దేశం చేస్తూ.. ఒక్కో ఓటరుకు, ఒక్కో ఇంచార్జ్‌ని నియమించి, పర్సన్ టూ పర్సన్ ఫార్ములాతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయ ఢంకా మోగించాలని పక్క ప్రణాళికలు రచించుకొని ముందుకు అడుగులు వేస్తోంది కాషాయ పార్టీ.. ఇంతకూ అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ చేరుకుటుందా?


ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

రాష్ట్రంలో ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ప్రచార గడువు కూడా మరి కొద్ది గంటల్లో ముగియనుంది. అందుకే బీజేపి పక్క వ్యూహంతో మూడు ఎమ్మెల్సీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఒకవైపు ప్రచారంలో అగ్రనేతల జోరు కొనసాగుతోంది. మరోవైపు పట్టభద్రులు, ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అభ్యర్థులకు గ్రౌండ్ లెవల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు సహకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే అభ్యర్థులు మాత్రం గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారంట.


90 శాతం ఓటర్లను కలిసామంటున్న బీజేపీ

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కమల దళం కుస్తీ పడుతోంది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కేడర్ మొత్తం రంగంలోకి దిగింది. ఇప్పటికే దాదాపు 90 శాతం వరకు ఓటర్లను కలవడం పూర్తయినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్నికల సరళిపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వంతో పాటు, కేడర్ కు దిశ నిర్దేశం చేసుకొస్తున్నారు.

ఒక్కొక్క ఓటరుని 3 నుంచి 4 సార్లు కలుస్తున్న కాషాయ సేన

గెలుపు అనుకున్నంత సులభం కాదని, టఫ్ ఫైట్ ఉంటుందని, కష్టపడితేనే మూడు స్థానాల్లో గెలుస్తామని బన్సల్ తాను చేయించుకున్న సర్వే రిపోర్టులను బట్టి తేల్చి చెపుతున్నారంట. కావలిసింది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని, హార్డ్ వర్క్ ముఖ్యమని చెప్పుకొచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే ఒక్కొక్క ఓటరును మూడు నుంచి నాలుగు సార్లు నేరుగా ఫేస్ టూ ఫేస్ కలుస్తూ వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు కాషాయ శ్రేణులు ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు. ఇక ప్రచారం గడువు ముగియనుండటంతో ప్రచారాన్ని మరింత జోష్ తో కొనసాగిస్తున్నారు.

స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం

ఈనెల 27న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాషాయ పార్టీ చెమటోడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే బీజేపీ నేతలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఈ గెలుపే వచ్చే స్థానిక, జీహేచ్ఎంసి ఎన్నికలలో ప్రభావం చూపుతుందన్న అంచనాల్లో నాయకత్వం ఉంది. అయితే పార్టీ అభ్యర్థులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై కాషాయ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి ఇదే అంశం బన్సల్ దృష్టికి వెళ్లడంతో అభ్యర్థులకు, ఇంచార్జీలకి, క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మల్క కొమురయ్య గెలుపు ఖాయమైందని ధీమా

అదలా ఉంటే ఇప్పటికే మల్క కొమురయ్య గెలుపు ఖాయమైందని కాషాయ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల్లో పోటీ గట్టిగానే ఉంటుందని, కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను గనుక ఉపయోగించుకొని కష్టపడితే కచ్చితంగా ఆ రెండు స్థానాల్లో కూడా గెలుస్తామన్న ధీమాలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. కరీంనగర్, నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య పోటీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 25, 921 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఒక్కో ఓటర్ కు ఒక్కో కార్యకర్తను కాషాయ పార్టీ నియమించి జోరుగా క్యాంపెయిన్ చేస్తోంది. ఆయా ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని విజయం సాధించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది.

పట్టభద్రుల సెగ్మెంట్లో 3,41,313 మంది ఓటర్లు

ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం పట్టభద్రులు 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో అంజిరెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. పోటీని దృష్టిలో పెట్టుకొని 25 మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జీని నియమించి తమదైన శైలిలో పక్క ప్రణాళికలతో కమలనాథులు ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు.

మండలిలో సంఖ్యా బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి సరోత్తం రెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సన్నాహాక సమావేశాల్లో పాల్గొని బీజేపీ క్యాండెట్లను గెలిపించాలని కోరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కళ్ల ముందు ఉన్నాయని.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని ఓటర్లకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా దాన్ని నిరూపించాలని కాషాయ పార్టీ గట్టిగా ప్లాన్ చేస్తోంది. మండలిలో సంఖ్యాబలం పెంచుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనిపించుకోవాలని భావిస్తున్న కమలదళానికి టీచర్లు, గ్రాడ్యూయేట్లు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారో చూడాలి.

Related News

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Necklace Road Flyover: 8 నిమిషాల్లో బేగంపేట?.. నక్లెస్ రోడ్ పై కొత్త ఫ్లైఓవర్ స్కెచ్ ఇదే!

CM Revanth Reddy: ముందు చట్టం తెలుసుకో.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్

Telangana Rains: మరో 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో తస్మాత్ జాగ్రత్త!

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

Big Stories

×