BigTV English

Sunil Gavaskar: విఫలమైన వాళ్లు రంజీలు ఆడాలి.. సునీల్ గవాస్కర్..!

Sunil Gavaskar: విఫలమైన వాళ్లు రంజీలు ఆడాలి.. సునీల్ గవాస్కర్..!

IND Vs ENG Sunil Gavaskar Highlights: టీమ్ ఇండియాలో విఫలమవుతున్న యువ ఆటగాళ్లు అర్జంటుగా రంజీల్లో ఆడి, పోయిన ఫామ్ ని తిరిగి పొందాలని సీనియర్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఎన్నాళ్లని జాతీయ జట్టులో ఆడిస్తూ ఉంటారని  సీరియస్ అయ్యాడు. కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని, మూడో జట్టు ఎంపికలో ప్రయోగాలు చేయవద్దని తెలిపాడు.


యశస్వి జైశ్వాల్‌‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ మిస్ చేసుకుని, సెకండ్ టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించడం గొప్ప విషయమని అన్నాడు. తనలో త్వరగా నేర్చుకునే తత్వం ఉందని, అది ఆటలో అప్లై చేస్తున్నాడని తెలిపాడు. టీమ్ ఇండియాలో కీలకమైన సభ్యుడిగా మారతాడని తెలిపాడు.

ఎట్టకేలకు శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించి, తిరిగి ట్రాక్ ఎక్కడం టీమ్ ఇండియాకి శుభ పరిణామం అని అన్నాడు. నిజానికి తను క్లిక్ అయితే విరాట్ కొహ్లీ ప్లేస్‌ని రీప్లేస్ చేస్తాడని తెలిపాడు. గిల్ సమస్య తీరింది. ఇక శ్రేయాస్ ఆట తీరు ఇంకా  గాడిన పడలేదని అన్నాడు. నిజానికి రెండో టెస్ట్ గెలిచిందని సంబరపడాల్సిన అవసరం లేదని అన్నాడు.


Read More : Attack on Fabian Allen: వెస్టిండీస్ ఆల్ రౌండర్ అలెన్ పై దాడి.. దోపిడీ..

మ్యాచ్‌ని గమనిస్తే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో యశస్వి, సెకండ్ ఇన్నింగ్స్‌లో గిల్ మాత్రమే ఆడారని, మిగిలిన వారెవరూ వీరికి సపోర్ట్ ఇవ్వలేదని అన్నాడు. ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నాడు. బౌలింగ్‌లో బుమ్రా క్లిక్ అయ్యాడు కాబట్టి జట్టు విజయం సాధించిందని అన్నాడు. 

ఇలా జట్టులో ఇద్దరు, ముగ్గురు ఆడితే సరిపోదని అన్నాడు. ఫామ్ కోల్పోయిన వారిని రంజీల్లో ఆడించాలని, అక్కడే మళ్లీ పికప్ అవుతారని తెలిపాడు. 80 ఏళ్లుగా రంజీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మేం అందరం అలా ఆడి వచ్చినవాళ్లమేనని అన్నాడు. ఇందులో సిగ్గు పడాల్సినదేమీ లేదని అన్నాడు.

ప్రస్తుతం రంజీ మ్యాచ్‌లు జరగడం, వీరందరికి ఒక అద్బుతమైన అవకాశంగా భావించాలని అన్నాడు. లేదంటే మూడో టెస్ట్ మ్యాచ్‌కి ఇంకా వారం రోజులపైనే సమయం ఉంది. ఫామ్ కోల్పోయిన వారు ప్రాక్టీసు కన్నా, టెక్నిక్ ఎక్కడ మిస్ అవుతున్నారనేదానిపై ఫోకస్ చేయాలని సలహా ఇచ్చాడు.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×