BigTV English

Attack on Fabian Allen: వెస్టిండీస్ ఆల్ రౌండర్ అలెన్ పై దాడి.. దోపిడీ..!

Attack on Fabian Allen: వెస్టిండీస్ ఆల్ రౌండర్ అలెన్ పై దాడి.. దోపిడీ..!

Attack on West Indies Cricketer Fabian Allen: సౌతాఫ్రికాలో టీ 20 లీగ్ ఆడుతున్న వెస్టిండీస్ ప్లేయర్ ఫాబియన్ అలెన్ పై దుండగులు దాడి చేశారు. అతన్ని తుపాకితో బెదిరించి విలువైన వాచ్, పలు వస్తువులు తీసుకుని పారిపోయారు.


జోహెన్స్ బర్గ్ లో టీమ్ బస చేసిన ఘోటల్ వద్ద  ఘటన జరిగింది. అయితే అదృష్టం ఏమిటంటే, దాడిలో తనకెటువంటి గాయాలు కాలేదు. దీనవల్ల వస్తువులు పోతే పోయాయి, లేదంటే తన కెరీర్ ఇబ్బందుల్లో పడేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.

పార్ల్ రాయల్స్ జట్టు ప్రతినిధి మాట్లాడుతూ అలెన్ సురక్షితంగా ఉన్నాడని తెలిపాడు. ఈ లీగ్ లో కొనసాగుతాడని పేర్కొన్నాడు. అయితే జోబర్గ్ సూపర్ కింగ్స్-పార్ల్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో అలెన్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఘటన జరిగింది. 


Read More: Jasprit Bumrah : ఐసీసీ ర్యాంకింగ్స్.. జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత..

ఈ సంఘటనతో ఆటగాళ్లకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, భద్రత కూడా అంతే ముఖ్యమని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు. అలెన్ కే కాదు, ఆటగాళ్లు అందరికీ పటిష్ట భద్రత కల్పిస్తున్నామని టీ 20 లీగ్ నిర్వాహకులు తెలిపారు.

జట్టు సభ్యులు బయటకు వెళ్లేటప్పుడు నలుగురైదురు కలిసి వెళ్లాలని కోరారు. దీనివల్ల టెన్షను ఉండదని, అందరూ సురక్షితంగా చేరుకుంటారని పేర్కొన్నారు.

2009లో పాకిస్తాన్ లోని లాహోర్ లో  శ్రీలంక క్రికెట్ జట్టుపై  డజను మందికి పైగా వ్యక్తులు రైఫిల్స్, గ్రైనేడ్లు, రాకెట్ లాంఛర్లతో దాడి చేశారు. ఇది ఉగ్రవాద దాడిగా పాకిస్తాన్ ప్రభుత్వం, ఐసీసీకి నివేదిక ఇచ్చింది.

ఇవే కాకుండా అభిమానుల పైత్యంతో క్రికెటర్లపై దాడులు జరుగుతుంటాయి. 2007 ప్రపంచ కప్ లో భారత జట్టు గ్రూప్ దశలోనే వెనక్కి వచ్చింది. దీంతో క్రికెట్ అభిమానులు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరించారు. క్రికెటర్ల దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. వారి ఇళ్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

ఇవే కాకుండా క్రికెటర్ల స్వయం కృతాపరాధాలు చాలా ఉంటాయి. పలు సందర్భాల్లో క్రీడాకారులు అత్యుత్సాహం చూపిస్తుంటారు. ఇటీవల టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుణె రోడ్ల మీద 200 కిమీ వేగంతో కారును డ్రైవ్ చేసుకు వెళ్లి, అందరిలో ఆందోళన కలిగించాడు. ఇక రిషబ్ పంత్ అయితే మృత్యువు వరకు వెళ్లి బయటపడ్డాడు.

సెలబ్రిటీ హోదా వస్తేనే సరిపోదు, వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అలెన్ పై దాడి తర్వాత అందరూ మరొక్కసారి గత సంఘటనలను గుర్తు చేస్తున్నారు.

Tags

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×