BigTV English

Sunil Gavaskar : స్పిన్ తిరిగితే చెత్త.. పేస్ పడితే గొప్ప పిచ్ అంటారా..? గవాస్కర్ సీరియస్..

Sunil Gavaskar : స్పిన్ తిరిగితే చెత్త..  పేస్ పడితే గొప్ప పిచ్ అంటారా..?  గవాస్కర్ సీరియస్..
Sunil Gavaskar

Sunil Gavaskar : సౌతాఫ్రికా గడ్డపై జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో కేప్ టౌన్ పిచ్ పై రచ్చరచ్చ అవుతోంది. ముఖ్యంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేవనెత్తిన అంశాలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రోహిత్ మాటలకు సీనియర్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కూడా మద్దతు తెలిపాడు. అంతే కాదు తను కూడా ఘాటుగానే విమర్శించాడు.


భారత్ లో ఇలాంటి ఒక టెస్ట్ మ్యాచ్ జరిగి, స్పిన్ తిరిగి, ఒకటిన్నర రోజులోనే ముగిసిపోతే, భారతదేశంలో పిచ్ లన్నీ నాసిరకం, చెత్తని కామెంట్లు చేస్తారు. అదే విదేశాల్లో పేస్ కు అనుకూలించి ఒకటిన్నర రోజులోనే ముగిసిపోతే మాత్రం ఇంత గొప్ప పిచ్ ఇంకొకటి లేదని అంటారు.

ఒకవేళ టీమ్ ఇండియా బ్యాటర్లు చేతులెత్తేస్తే, వీళ్లకు పేస్ బౌలింగ్ ఆడటం చేతకాదని మాట్లాడతారని అన్నాడు.  అదే స్పిన్ బౌలింగ్ కు విదేశీ బ్యాటర్లు అవుట్ అయితే మాత్రం వారి తప్పులేదన్నట్టు మాట్లాడతారని సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.


నేను ఆడినప్పుడు ఇలాంటివెన్నో చూశానని అన్నాడు. ఎందుకులే ఇలాంటి వివాదాస్పద అంశాల్లో తలదూర్చడం… ఒకవేళ మాట్లాడితే, అది నా వ్యక్తిగత అభిప్రాయంగా ఉండదు, దేశానికి ప్రతినిధిగా, మొత్తం భారతదేశానికంతటికి ఆపాదిస్తారని నోరు మూసుకుని కూర్చున్నామని అన్నాడు.

SENA దేశాలు అంటే సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు కూడా సౌతాఫ్రికా పిచ్ లపై  స్పందించాలని అన్నాడు. భారతదేశాన్ని విమర్శించడం ప్రతీ ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందని విరుచుకు పడ్డాడు.

టెస్టు క్రికెట్ అంటేనే బ్యాటర్లకు అగ్ని పరీక్షని అన్నాడు. ఫాస్ట్ బౌన్సీ పిచ్‌లపై పరుగులు చేయలేకపోతే అసలు వారు బ్యాట్స్‌మెన్ కాదంటూ SENA దేశాల్లో విమర్శలు చేస్తారు.  టర్నింగ్ పిచ్‌పై  ఆ దేశ ఆటగాళ్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోతే, వారిని కూడా చేతకాని బ్యాటర్లు అని అంటే, వారికెలా ఉంటుందని అన్నాడు.

ఇలా చెప్పినందకు క్షమించాలి. మీడియా కూడా వాస్తవాలనే మాట్లాడాలని కాస్త ఘాటుగానే స్పందించాడు. మరెన్నాళ్ల నుంచి గుండెల్లో మండుతుందో తెలీదు. గవాస్కర్ కూడా రోహిత్ కి సపోర్టుగా తన వాణి వినిపించాడు.

రోహిత్ శర్మ కూడా ఏమంటాడంటే  మేం ఎలాంటి పిచ్ ల మీదైనా ఆడతాం. ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. దీనిని మేం సవాల్ గా భావిస్తాం. మరి మీరెందుకు అలా భావించరని SENA దేశాలని ఉద్దేశించి అన్నాడు. ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. ఎంత దూరం వెళుతుందో చూడాల్సిందే.

Related News

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

Big Stories

×