BigTV English

Sunil Gavaskar to BCCI: బౌలర్లను కాపాడండి.. సునీల్ గవాస్కర్ BCCIకి రిక్వెస్ట్!

Sunil Gavaskar to BCCI: బౌలర్లను కాపాడండి.. సునీల్ గవాస్కర్ BCCIకి రిక్వెస్ట్!

Sunil Gavaskar Says Bowlers are Suffering Amid IPL 2024: ఐపీఎల్ లో హైదరాబాద్ చరిత్ర స్రష్టిస్తోంది. అత్యధిక స్కోర్లు చేస్తూ టీ 20 ఆటతీరునే ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. వీళ్లిలా అద్దిరబన్నాలా ఆడుతుంటే, బౌలర్లు తేలిపోతున్నారు. అంతేకాదు వారి భవిష్యత్తు కూడా అంధకారమైపోతోంది. రకరకాల ప్రశ్నలు నెట్టింట ఉదయిస్తున్నాయి. ఐపీఎల్ ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి బౌండరీ లైను ని కూడా తగ్గించారని అంటున్నారు.


బ్యాటర్ల కోసం అంత చేసిన నిర్వాహకులకు బౌలర్ల భవిష్యత్తుని కూడా కాపాడాలని అంటున్నారు. సీనియర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్యాయమని అంటున్నారు. నిజానికి ఇది క్రికెట్ ఆటే కాదని అంటున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని కూడా పెట్టారని విమర్శిస్తున్నారు. 11 మంది ఆటగాళ్లతో ఆడాల్సిన ఆటను 12 మందితో ఆడించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

లెజండరీ ఆటగాళ్లయినా సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వసీం అక్రమ్ ఇలా ఎంతో మంది ఆటగాళ్లు బౌలర్లకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడిలా హార్డ్ హిట్టింగు బ్యాటర్లను ఎంపిక చేయడంతో క్రికెట్ ఆట రొడ్డ కొట్టుడుగా మారింది. అంతా రోడ్డు మీద బజారు ఆటగాళ్లు ఆడుతున్న ఆటలా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుడ్డిగా కొడుతున్నామా? లేదా? అనేదే కొలమానంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: పవర్ ప్లే వీరులు.. హైదరాబాద్ సన్ రైజర్స్

ఒకనాటి ఎంతో కళాత్మకమైన ఆట, ప్లేయర్స్ మధ్యలోంచి డిఫెన్స్ ను ఛేదించుకుంటూ బ్యాటర్లు బాల్ ని కొడుతుంటే, వారి కళాత్మక ఇన్నింగ్స్ చూసేందుకు రెండు కళ్లూ సరిపోయేవి కావని అంటున్నారు. అలా ఎంతో మంది ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండుల్కర్ ఇలా ఎంతో మంది తమ అద్భుతమైన కళా నైప్యణ్యంతో క్రికెట్ ఆటకి ఒక వైవిధ్యాన్ని తీసుకొచ్చారని అంటున్నారు.

అలాంటి ఆటను ఖూనీ చేస్తున్నారని, బౌలర్లు జీవితాలు, వారి భవిష్యత్తులతో ఆటలాడవద్దని, ఆటలో నిబంధనలు మార్చాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. అంతా బ్యాటర్లకు అనుకూలంగా చేయవద్దని సీనియర్లు కోరుతున్నారు. ఈ అంశంపై అవసరమైతే ఐసీసీ, బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని చెబుతామని అంటున్నారు. డబ్బులే పరమావధి కాదని అంటున్నారు. ఇలాగే ఆడితే కొన్నిరోజులకి విరక్తి కలిగిందంటే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×