BigTV English

Top Power Play Hitters IPL 2024: టాప్ హిట్ పవర్ ప్లే వీరులు.. హైదరాబాద్ సన్ రైజర్స్!

Top Power Play Hitters IPL 2024: టాప్ హిట్ పవర్ ప్లే వీరులు.. హైదరాబాద్ సన్ రైజర్స్!

Top Power Play Hitters IPL 2024: ఐపీఎల్ లో పవర్ ప్లే అనగానే అందరికీ… ఆ 6 ఓవర్లపైనే దృష్టి ఉంటుంది. అక్కడ జరిగే మ్యాచ్ మొత్తం 20 ఓవర్ల మ్యాచ్ ని డిసైడ్ చేస్తుంది. అందుకే టాప్ 3 బ్యాటర్లు హార్డ్ హిట్టర్లని పెడతారు. ఒకరు అవుట్ అయితే, ఒకరు అందుకునేలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడా పంచ్ హిట్టింగ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ అందరికీ తాతలా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఆడుతున్న తీరు చూస్తుంటే మాములుగా లేదు. కరెక్టుగా క్రీజులో కూర్చుని కనెక్ట్ అయితే చాలు ఇరగకుమ్మి వదిలేస్తున్నాడు.


అతనికి తోడు చిచ్చరపిడుగులా అభిషేక్ శర్మ తోడయ్యాడు. ఒకరు అగ్గి అయితే, ఒకరు సుడిగాలిలా మారి బీభత్సం చేస్తున్నారు. లక్నో తో జరిగిన మ్యాచ్ లో అదే జరిగింది. ఇద్దరూ కలిసి 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టారు. ఈ నేపథ్యంలో అందరి ద్రష్టి పవర్ ప్లే పై పడింది. ఇంతవరకు పవర్ ప్లే 6 ఓవర్లలో ఎవరు ఎక్కువ పరుగులు చేశారని నెట్టింట జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ పవర్ ప్లే హిట్లర్ల విశేషాలు తెలుసుకుందాం.

2024  ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ వికెట్లు నష్టపోకుండా 125 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఫీట్ చేశారు.


Also Read: హైదరాబాద్ సన్ రైజర్స్ విధ్వంసం.. బద్ధలైన రికార్డులు

2024 తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ తొలి 6 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 107 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ చెలరేగి ఆడారు.

2017 ఆర్‌సీబీ, బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా తొలి 6 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 105 పరుగులు చేసింది. కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లైన్, సునీల్ నరైన్ ఇద్దరూ కలిసి చితక్కొట్టారు.

2014లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలి 6 ఓవర్లలో  సీఎస్‌కే  2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. సురేష్ రైనా ఒక్కడే అటు వికెట్లు పడుతున్నా 25 బంతుల్లో 87 పరుగులు చేసి రికార్ట్ ఫీట్ సాధించాడు. ఎందుకంటే ఓపెనర్లు డుప్లెసిస్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ స్మిత్ 7 పరుగులే చేశాడు. ఎక్స్ ట్రాలతో కలిసి రైనా ఈ ఫీట్ సాధించాడు.

Also Read: Jay Shah says RahulDravid can apply: త్వరలో కోచ్ పదవికి నోటిఫికేషన్, ఇంపాక్ట్ రూల్‌పై జై షా మాట

చూశారు కదండీ పవర్ ప్లే విధ్వంసం. మరి కొద్దిరోజుల్లో జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్ లో మన టీమ్ ఇండియా ఎలా ఆడుతుందో వేచిచూడాల్సిందే మరి.

Related News

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?

Abhishek- Gambhir: అభిషేక్ శ‌ర్మ‌ను బండ‌బూతులు తిట్టిన గంభీర్‌..ఈ దెబ్బ‌కు ఉరేసుకోవాల్సిందే !

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో

Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

Shoaib Akhtar : ఇండియాకు ఇగో ఎక్కువ‌.. ఆదివారం మొత్తం దించేస్తాం..ఇక కాస్కోండి !

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. హరీస్ రవుఫ్ పై బ్యాన్..!

Big Stories

×