Big Stories

SRH Vs RR Qualifier 2 IPL 2024: చిదంబరం స్టేడియంలో.. రెండు జట్లకి చెత్త రికార్డ్..!

SRH Vs RR Qualifier 2 – Worst Record at MA Chidambaram Stadium for both Team: ఐపీఎల్ 2024లో సొంతంగా కొన్ని మ్యాచ్ లు ఆడి, కొంత అదృష్టం కూడా తోడు రావడంతో హైదరాబాద్ ముందడుగు వేసింది. ఎలాగైతేనేం, క్వాలిఫైయర్ 2లో అడుగుపెట్టింది. అయితే నేడు కీలక మ్యాచ్ రాజస్థాన్ తో చెన్నయ్ లోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. అయితే  ఈ రెండు జట్లకి కూడా ఈ స్టేడియంలో చెత్త రికార్డు ఉండటం విశేషం.

- Advertisement -

ఏమిటా చెత్త రికార్డు అంటే, ఈ స్టేడియంలో 10 మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ ఒక్క మ్యాచ్ లోనే గెలిచింది. అలాగే రాజస్థాన్ కూడా 9 మ్యాచ్ లు ఆడింది. తను మాత్రం ఒక ఆకు ఎక్కువ చదివింది. అందుకని 2 మ్యాచ్ లు గెలిచింది. మరింత అధ్వానంగా ఆడిన రెండు జట్లు,  ఇంతమంది వీరాధి వీరులు కలిసి నేడు చిదంబరం స్టేడియంలో తలపడితే ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

- Advertisement -

ఈ సీజన్ మొత్తంలో ఒకటి ఓడి, ఒకటి గెలవడం లేదా రెండు ఓడి, రెండింట్లో దుమ్ము దులపడం ఇలాగే చేస్తూ.. హైదరాబాద్ ఇంత దూరం వచ్చింది. అందుకని క్వాలిఫైయర్ 1లో ఓడింది కాబట్టి,  క్వాలిఫైయర్ 2 లో ఆడి రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తుందని
నెటిజన్లు సమీకరణాలు వేస్తున్నారు.

Also Read: ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంపైర్లు వీరే..

రాజస్థాన్ కూడా మొదట్లో వరుసగా గెలిచి, చివర్లో వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయి, మళ్లీ దశ లేని ఆర్సీబీపై గెలిచి ఒకింత ఆత్మవిశ్వాసంతో ఉంది. కాకపోతే జట్టులోని ఆటగాళ్లందరూ అనారోగ్యం బారిన పడ్డారని కెప్టెన్ సంజూ శాంసన్ బాంబ్ పేల్చాడు. అంతేకాదు.. చాలామంది దగ్గుతున్నారని కూడా చెప్పడం కొసమెరుపు.

ఇప్పుడీ మాట నెట్టింట వైరల్ గా మారింది. అంటే క్వాలిఫైయర్ 2 లో ఓడినా తమని ఏమీ అనవద్దని ముందుగానే సంజూ చెప్పాడా? అనే అనుమానాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 19 మ్యాచ్ లు జరిగాయి. రాజస్థాన్ 9 సార్లు, హైదరాబాద్ 10 సార్లు విజయం సాధించాయి. మరి నేడు రాజస్థాన్ గెలిచి లెక్క సమం చేస్తుందా? లేక హైదరాబాద్ గెలిచి మరింత ముందడుగు వేస్తుందా..? అనేది చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News