BigTV English

Ashika Ranganath in Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లో ఛాన్స్ కొట్టేసిన కన్నడ అందం..

Ashika Ranganath in Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లో ఛాన్స్ కొట్టేసిన కన్నడ అందం..

Ashika Ranganath got a Chance in Chiranjeevi’s Vishwambhara Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో అత్యంత భారీ లెవెల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తే.. టైటిల్ గ్లింప్స్ ఆ హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు.


ఈ గ్లింప్స్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలిసిపోయింది. అయితే దర్శకుడు వశిష్ట కూడా ఈ మూవీకి సంబంధించి పలు విషయాలు ఇంటర్వ్యూలలో వెల్లడిస్తూ బజ్ క్రియేట్ చేశాడు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మరికొంత మంది తారలు నటించనున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు జోరుగా సాగాయి. అందులో చాలామంది నటీమణుల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా హీరోయిన్ సురభి కూడా ఉంది. ఈ బ్యూటీ విశ్వంభర మూవీలో నటిస్తుందని ఇదివరకే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆమె చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తుందని టాక్ వినిపించింది.


Also Read: చిరు కెరీర్‌‌లో ఇదే తొలిసారి.. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం అన్ని రోజులు కేటాయించాడా..?

విశ్వంభరలో చిరుకి దాదాపు నలుగురు లేదా ఐదుగురు చెల్లెల్లు ఉండొచ్చని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఆ చెల్లెల్ల పాత్ర కోసమే మూవీ యూనిట్ సినీ తారలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతో మంది సినీ నటీమణులను సంప్రదించిన మూవీ యూనిట్ తాజాగా ఓ యంగ్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేశారు.

కల్యాణ్ రామ్‌తో అమిగోస్, నాగార్జునతో నా సామిరంగ సినిమాలో నటించి తన అందంతో అట్రాక్ట్ చేసిన యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ విశ్వంభర మూవీలో నటిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. ఇందులో భాగంగానే ఆషికాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో ఆషికా తన అందంతో తలతల మెరిసిపోతుంది. అయితే మరి ఈ బ్యూటీ హీరోయిన్‌ పాత్రలో నటిస్తుందా? లేక చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తుందా అనేది చూడాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Bhaje Vaayu Vegam Trailer: కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ సూపరో సుపర్

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×