BigTV English

Surya Kumar Yadav : సూర్య కుమార్ వాచ్ లో రాముడు, హనుమంతుడు… దీని ధర ఎంత అంటే

Surya Kumar Yadav : సూర్య కుమార్ వాచ్ లో రాముడు, హనుమంతుడు… దీని ధర ఎంత అంటే

 Surya Kumar Yadav :  టీమిండియా టీ-20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అతన్ని మిస్టర్ 360 అని పిలుస్తుంటారు. అన్ని వైపుల నుంచి అద్భుతమైన షాట్లు ఆడగల క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది సూర్యకుమార్ యాదవ్ అనే చెప్పవచ్చు. వచ్చే నెలలో జరుగబోయే ఆసియా కప్ కోసం టీమిండియా క్రికెట్ జట్టును ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యుల జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. శుబ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఆసియా కప్ జట్టు ఎంపికను ప్రకటించడానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. ఆ సమయంలో వారు ఆటగాళ్ల పేర్లను ప్రకటించి.. అనంతరం మీడియా ప్రతినిధులు సంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇదే సందర్భంలో సూర్యకుమార్ యాదవ్ చేతికి ఉన్న ఖరీదైన వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. 


సూర్యకుమార్ వాచ్ ధర ఎంతంటే..? 

సూర్యకుమార్ యాదవ్ ధరించిన ఆ వాచ్ జేకబ్ అండ్ కో (Jacob&Co.) కంపెనీకి చెందినది. సూర్యకుమార్ యాదవ్ ధరించిన వాచ్ జేకబ్ అండ్ కో రామమ్ జన్మభూమి టైటానియం ఎడిషన్. దీని స్ట్రాప్ కాషాయం రంగులో ఉంది. భారతీయ మార్కెట్ లో అయితే ఈ వాచ్ ధర దాదాపు రూ.34లక్షలు అంట. ఈ వాచ్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ ధరించిన వాచ్ లో రాములు, హనుమంతుడు ఇద్దరూ ఉన్నారు.  ఇక ఈ వాచ్ కేవలం పురుషుల కోసమే ప్రత్యేకంగా తయారుచేయబడింది. భారతీయ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశారు. ఇది 100 శాతం వాటర్ ఫ్రూప్. ఇది ఒక లిమిటేడ్ ఎడిషన్ వాచ్. దీనికి 2 సంవత్సరాల వారెంటీ కలదు. ఈ వాచ్ ను స్విట్జర్లాండ్ కంపెనీ తయారు చేసింది. 


ఆ జెర్సీలో టీమిండియా.. 

సెప్టెంబర్ 09 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. భారత జట్టులో ఎంపికైన 15 మంది ఆటగాళ్లు 3-4 రోజుల ముందు యూఏఈ కి చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. భారత్ ఆసియా కప్ లో డిఫెండంగ్ ఛాంపియన్ గా ఉంది. ఆ టైటిల్ ని కాపాడుకోవడం సూర్యకుమార్ యాదవ్ కి ఇప్పుడు పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఆసియా కప్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఎప్పటిమాదిరిగానే ఈ టైటిల్ ఫేవరేట్ గా టీమిండియా పై అందరి దృష్టి ఉంటుంది. ఆటగాళ్ల జాబితాలోని మార్పులతో పాటు ఈ సారి జట్టుకు సంబంధించిన మరో ప్రధాన తేడా జెర్సీలో కనిపించవచ్చు. గత సారి జెర్సీ పై కనిపించిన టైటిల్ స్పాన్సర్స్ డ్రీమ్ 11 లోగో ఈ సారి కనిపించకపోవచ్చని సమాచారం. సెప్టెంబర్ 10న యూఏఈతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లందరూ బ్లూ కర్ టీ-20 జెర్సీలో మైదానంలోకి దిగనున్నారు. ఈ జెర్సీ పై భారత్ పేరు, బీసీసీఐ లోగో, ఆసియా కప్ లోగో కనిపిస్తాయి. కానీ డ్రీమ్ 11 లోగో మాత్రం కనిపించకపోవచ్చని తెలుస్తోంది. 

Related News

Dream 11 Second Innings : డ్రీమ్ 11 ఇండియాలో బ్యాన్ అయిందా.. షాక్ లో ఐపీఎల్ అభిమానులు.. కేంద్రం క్లారిటీ ఇదే

Watch Video: పాపం ట్రాఫిక్ పోలీస్.. క్రికెట్ ఆడలేక.. బ్యాట్ అడుక్కుని మరీ… వీడియో వైరల్

Dhanashree Verma : చాహల్ నమ్మకద్రోహి.. ధనశ్రీ వర్మ కు సూర్య ఫ్యామిలీ సపోర్ట్.. ఇక ముందుంది ముసళ్ళ పండుగ

Bhuvaneshwar Kumar: అత్యంత ప్రమాదకరంగా మారుతున్న భువనేశ్వర్… టీమిండియాలోకి రీ ఎంట్రీ

Rinku Singh Love Story: రింకు సింగ్ – ప్రియా సరోజ్ ను కలిపింది కరోనా లాక్ డౌనేనా.? లవ్ స్టోరీ లీక్

Big Stories

×