Teja Sajja: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా ఎటువంటి విజయం సాధిస్తుందో ఎవరు ఊహించలేరు. ఎవరికి అంతు చిక్కది కూడా. ఎటువంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది అని పూర్తి క్లారిటీ ఉన్న దర్శకుడు రాజమౌళి మాత్రమే. అందుకే ఇప్పటివరకు తన చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.
సినిమాల విడుదలైన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తాయి. ఆ సినిమా ఆ రేంజ్ లో హిట్ అవుతుంది అని ఎవరు ఊహించరు. అలా చిన్న సినిమాగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ నటించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
భారీ సినిమాల మధ్య
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. సినిమా గురించి నాగ వంశీ కూడా మాట్లాడుతూ విపరీతమైన హైప్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాని ఒక కమర్షియల్ సినిమా అంటూ ప్రమోషన్స్ లో చెప్పారు. ఇది ఒక త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ మదర్ సెంటిమెంట్ సినిమా అని చెప్పి ఉంటే దాన్ని రిజల్ట్ ఇంకోలా ఉండేది. గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైందవ్ సినిమాలు తో పాటు రిలీజ్ అయింది హనుమాన్. ఈ సినిమాకి సరిగ్గా థియేటర్స్ కూడా దొరకలేదు. కానీ ఇవన్నీ సినిమాలను మించి అద్భుతమైన సక్సెస్ సాధించింది హనుమాన్. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
మరో స్టార్ హీరో టార్గెట్…
గతంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి పోటీగా వచ్చింది తేజ హనుమాన్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకి మిరాయి సినిమా పోటీ రానున్నట్లు తెలుస్తుంది. దసరా కానుకగా మిరాయి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి సినిమాల్లో కూడా చిన్నప్పుడు కొన్ని పాత్రల్లో నటించాడు తేజ. ఆల్రెడీ మహేష్ బాబు తో పోటీ పడిన తేజ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పోటీకి సిద్ధమవుతున్నాడు అనిపిస్తుంది. దీనితో ఆ ఇద్దరి హీరోలను టార్గెట్ చేసి మరి సినిమాలు వదులుతున్నాడా అంటూ కొంతమంది ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే మిరాయి సినిమాని సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు.
Also Read: Chiranjeevi : 2027 సంక్రాంతి బరిలో మళ్లీ చిరునే… కానీ, ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవు