Watch Video: భారతదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు, మహిళలు.. ఇలా చాలామంది క్రికెట్ ఆడడానికి, చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలు ప్రారంభం అయితే.. ఇక క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పొచ్చు. ఐతే చాలామంది క్రికెటర్ కావాలని కలలు కంటుంటారు. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. ఇది ఓ ఎమోషన్, ఎంతోమందికి క్రికెట్ అంటే అభిమానం. మరికొంతమందికి ఈ క్రికెట్ జీవన విధానం కూడా.
Also Read: Bhuvaneshwar Kumar: అత్యంత ప్రమాదకరంగా మారుతున్న భువనేశ్వర్… టీమిండియాలోకి రీ ఎంట్రీ
అలాంటి క్రికెట్ కోసం మన దేశంలో పలువురు క్రికెటర్లు తమ చదువును సైతం వదిలేసి బ్యాట్ లేదా బంతితో తమ జీవితాన్ని మార్చుకున్నారు. జీవితంలో విద్య ప్రధానం అయినప్పటికీ.. వారి కఠినమైన కృషి, అంకితభావం వారిని అసాధారణ విజయాలు సాధించేలా చేశాయి. ఇలా క్రికెట్ కోసం చదువును మధ్యలో వదిలేసిన చాలామంది భారత క్రికెటర్ల గురించి మనకు తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని, గిల్, రాహుల్ ద్రావిడ్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్లు.. చదువును మధ్యలోనే వదిలేసి.. వారి కళలను సాకారం చేసుకున్నారు.
కానీ వ్యక్తిగత కారణాలు, ఇంటి బాధ్యతల వల్ల చాలామంది వారికి ఎంతగానో ఇష్టమైన క్రికెట్ ని వదులుకున్న వారు లక్షల్లో ఉన్నారు. అలా వారి జీవితంలో క్రికెట్ ని వదులుకున్న తర్వాత.. ఎప్పుడో పండగల సమయంలో, లేదా గల్లీలో క్రికెట్ ఆడుతున్న పిల్లలను చూసినప్పుడు వారికి ఎంతగానో ఆనందం కలుగుతూ ఉంటుంది. మళ్లీ ఒక్కసారైనా బ్యాట్ పట్టుకోవాలనే ఆలోచన వారిలో కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. అతడు ఓ సాధారణ ట్రాఫిక్ కానిస్టేబుల్. కానీ బ్యాట్ ని చూడగానే ఒక్కసారిగా తన బాల్యంలోకి వెళ్ళిపోయాడు.
ఏపీలోని ఓ సిగ్నల్ పాయింట్ వద్ద నుండి ఓ యువకుడు పల్సర్ బైక్ పై తన ముందు బ్యాట్ పెట్టుకొని వస్తున్నాడని గమనించిన ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఆ యువకుడిని సిగ్నల్ పాయింట్ వద్ద ఆపాడు. అనంతరం అతడి వద్ద ఉన్న బ్యాట్ ని తీసుకొని.. బ్యాట్ తో కాసేపు బంతిని కొడుతున్నట్లుగా షాట్ ఆడాడు. అనంతరం ఆ బ్యాట్ కి ముద్దు పెట్టాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు.. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన జీవితంలో క్రికెట్ ని చాలా మిస్ అవుతున్నాడని.. ఈ వీడియో చూస్తే అతడికి క్రికెట్ పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Rinku Singh Love Story: రింకు సింగ్ – ప్రియా సరోజ్ ను కలిపింది కరోనా లాక్ డౌనేనా.? లవ్ స్టోరీ లీక్
అయితే ఈ వీడియో చూసిన కొంతమంది.. ఆ బైక్ పై వచ్చిన వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడంతో.. అతడికి ఫైన్ వేసారా..? అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం.. క్రికెట్ అంటేనే ఓ ఎమోషన్ అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. వైరల్ గా మారిన ఈ వీడియోలో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్యాట్ కి ముద్దు పెట్టుకున్న సందర్భం మాత్రం అందరిని ఎమోషన్ కి గురిచేస్తుంది.
?utm_source=ig_web_copy_link