Dhanashree Verma : టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra chahal) నుంచి సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధనశ్రీ వర్మ (Dhanasree Verma) విడిపోయిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ లో వివాహ బంధంతో వీరు ఒక్కటయ్యారు. అయితే 2022 నుంచి విడివిడిగా ఉంటున్నారు. దాదాపు 18 నెలల తరువాత ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. కోర్టు తీర్పు వెల్లడించే సమయంతో తీవ్ర భావోద్వేగానికి గురైనట్టు ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది ధనశ్రీ వర్మ. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. “ఎదిగేందుకు ఇది సరైన సమయం. ఇప్పుడే కొత్త చాప్టర్ ఆరంభం” అంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీగా ధన శ్రీ (Dhanasree Verma) వర్మ పెట్టుకుంది. అది వైరల్ అవుతోంది.
Also Read : Bhuvaneshwar Kumar: అత్యంత ప్రమాదకరంగా మారుతున్న భువనేశ్వర్… టీమిండియాలోకి రీ ఎంట్రీ
ధనశ్రీ కి దేవీషా సపోర్ట్
“హ్యుమన్స్ ఆఫ్ బాంబే” అనే పాడ్ కాస్ట్ లో తన విడాకుల గురించి బయటికి వచ్చి మాట్లాడటం ద్వారా ధన శ్రీ చూపిన ధైర్యానికి టీమిండియా టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) భార్య దేవీష (Devisha) ఓ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ప్రశంసల వర్షం కురిపించింది. మరోవైపు దేవీషా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడ్డిట్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. ” నీ మీద చాలా గౌరవం, ప్రేమ ” అని దేవిషా ఆ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. రెడ్డిట్ లో దేవీషా పోస్టు కి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓ యూజర్.. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) భార్య దేవీషా(Devisha) ధనశ్రీ వర్మ (Dhanasree Verma) కోసం నిలబడటం చాలా మంచిది. ఆమెకు మనకంటే స్పష్టంగా తెలుసు అని పోస్ట్ చేశారు. ధనశ్రీ వర్మ కు సూర్య ఫ్యామిలీ సపోర్ట్ చేయడంతో చాహల్ (Chahal) కి ముందు ముందు ముసుళ్ల పండుగ ఉందని కొందరూ కామెంట్స్ చేయడం విశేషం.
నియంత్రించుకోలేకపోయా..
కోర్టులో జడ్జీ విడాకుల తీర్పు చదువుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురైనట్టు ధన శ్రీ వర్మ (Dhanasree Verma) వెల్లడించింది. ” విడాకుల సమయంలో నాపై చాలా ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఫేక్ మ్యారేజ్ చేసుకున్నానని నిందించారు. పర్సనల్ లైఫ్ అని చెప్పేందుకు చాలా కారణాలు ఉంటాయి. నాణానికి రెండు వైపులా చూడాలి. బొమ్మ, బొరుసు రెండు ఉంటాయి. కానీ కొందరూ మాత్రం కేవలం ఒకవైపు చూసి అదే నిజమని నమ్ముతారు. కేవలం ఒక్కచేతితోనే చప్పట్లు కొట్టలేమని గుర్తించరు. విడాకుల కోసం మేము మానసికంగానూ సిద్ధమైనప్పటికీ.. తీర్పు వచ్చినప్పుడు మాత్రం ఏడుపును నియంత్రించుకోలేకపోయాను. నా జీవితం నుంచి అతడే (చాహల్ ) ముందు వెల్లిపోయాడు. అయినా ఇలాంటి విషయాల్లో ముందు నన్నే నిందిస్తారని తెలుసు. ఆ రోజు చాహల్ టీ షర్ట్ స్టంట్ చేస్తాడని నాకు తెలుసు. నా జీవిత భాగస్వామికి ప్రతీ విషయంలోనూ మద్దతుగా నిలిచా. అయినా నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది” అంటూ ధనశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.