Bhuvaneshwar Kumar: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం తన బలమైన క్రికెటర్లలో ఒకరిని బాగా మిస్ అవుతుంది. ఇప్పుడు ఆ ఆటగాడు త్వరలోనే భారత జట్టులోకి తిరిగి రాబోతున్నట్లు సమాచారం. భారత క్రికెట్ జట్టులోని ఈ ఆటగాడిని మొదట టెస్ట్ జట్టు నుండి, ఆ తరువాత టి-20 జట్టు నుండి తొలగించారు. ఆ తరువాత ఈ ఆటగాడిని వన్డే జట్టు నుండి కూడా తొలగించారు. ఇటువంటి పరిస్థితులలో భారత జట్టులోని ఈ ఆటగాడి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆటగాడు తిరిగి జట్టులోకి రాబోతున్నాడని తెలిసిన క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతడు మరెవరో కాదు.. టీమ్ ఇండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.
Also Read: Rinku Singh Love Story: రింకు సింగ్ – ప్రియా సరోజ్ ను కలిపింది కరోనా లాక్ డౌనేనా.? లవ్ స్టోరీ లీక్
ఇతడు చివరగా 2022 జనవరి 21న సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ ఆడాడు. అలాగే 2022 నవంబర్ 22న న్యూజిలాండ్ తో జరిగిన టి-20 మ్యాచ్, 2018లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ ఇరువైపులా బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో ఎంతో అనుభవంతుడు. అలాగే బ్యాట్ తో కూడా బాగా రాణించేవాడు. చాలాసార్లు భారత జట్టును క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేశాడు.
2018లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన తన చివరి టెస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ 63 పరుగులు చెయ్యడమే కాకుండా.. నాలుగు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక 2025 ఐపీఎల్ 18వ సీజన్ లో భువనేశ్వర్ కుమార్ {Bhuvaneshwar Kumar} తన అనుభవాన్ని అంతా ఉపయోగించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ అందుకోవడంలో కీలకంగా మారాడు. అతడు వేసిన ఒకే ఓవర్ లో ఇద్దరు పంజాబ్ కింగ్స్ హిట్టర్లను పెవిలియన్ కి పంపి.. ఓకే ఓవర్ లో మ్యాచ్ గమనాన్ని మొత్తం మార్చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్ సిక్సర్ బాదినప్పటికీ.. ఆ తరువాత బంతినే వికెట్ గా మలిచి తానేంటో నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో 17వ ఓవర్ వేసిన భువనేశ్వర్ 2 వికెట్లు తీయడంతో పాటు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ కి ఓటమి తప్పలేదు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ టీ-20 లీగ్ లోను బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు భువనేశ్వర్ కుమార్. ఉత్తర ప్రదేశ్ టీ-20 లీగ్ లో లక్నో ఫాల్కన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ స్వింగ్ కింగ్.. గౌర్ గోరఖ్ పూర్ తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి.. కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఇంకా స్వింగ్ తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు.
Also Read: Shubman Gill: ఆసియా కప్ కు ముందు టీమిండియా కు ఎదురు దెబ్బ…. ఎమర్జెన్సీ వార్డులో గిల్ ?
ఇటీవల ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. భువనేశ్వర్ కుమార్ ని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. 2025 ఐపీఎల్ సీజన్ లో భువనేశ్వర్ మెరుగైన ప్రదర్శన చేశాడని గుర్తు చేశారు. గత టి-20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లో అతడు విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత అద్భుతంగా రాణించాడని.. కానీ సెలక్టర్లు అతనికి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నాడు. ఈ క్రమంలో తన స్వింగ్ బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేస్తున్న భువనేశ్వర్ కుమార్.. త్వరలోనే టీమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Bhuvaneshwar Kumar's swing in UP T20 league pic.twitter.com/odZXuM0Jvu
— Rosesh (@roseshpoet) August 23, 2025