Chiranjeevi : మామూలు టైంలో కంటే సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు విపరీతమైన మార్కెట్ ఉంటుంది. అందుకే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతి సంక్రాంతికి శ్రీ వెంకటేశ్వర బ్యానర్ నుండి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం అయితే ఏకంగా రెండు సినిమాలను విడుదల చేసింది ఆ సంస్థ. ఒక సినిమా తీవ్రంగా నష్టాలు తీసుకొస్తే ఇంకో సినిమా అధికంగా లాభాలు తీసుకొచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి కూడా 2025 సంక్రాంతికి సంబంధించి విశ్వంభర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వద్దామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించిన సీజీ వర్క్ పెండింగ్ లో ఉంది. పూర్తిస్థాయిలో సీజీ వర్క్ కంప్లీట్ అయితే కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయను అని దర్శకుడు పట్టు పట్టి కూర్చున్నాడు.
2027 సంక్రాంతి బరిలో మళ్లీ చిరు
మెగాస్టార్ చిరంజీవికి బాగా కలిసి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య 2023 సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవిలో మిస్సయిన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను ఈ సినిమాలో కొంతమేరకు బయటకు తీసాడు బాబీ. ఈ సినిమాలో యాక్షన్ కూడా వర్కౌట్ అయింది. ఇప్పుడు మళ్లీ మరోసారి బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నాను. మెగాస్టార్ కెరియర్ లో రాబోతున్న 158 వ సినిమా ఇది. సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ సినిమా విడుదల కానుంది.
ఆ పప్పులు ఏమి ఉడకవ్
నిన్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాల అప్డేట్స్ వచ్చాయి. కానీ ఆ అప్డేట్స్ కొంతమేరకు మాత్రమే కిక్ ఇచ్చాయి. కానీ శ్రీకాంత్ ఓదెల వేసిన ట్వీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది నా కోసం నేను తీసుకుంటున్న సినిమా అని శ్రీకాంత్ ఓదెల చిరు సినిమా గురించి రాసుకొచ్చాడు. చిరంజీవి అంటే జీవితాంతం ఆడే సినిమా అంటూ ట్వీట్ లో మరోసారి గుర్తు చేశాడు. ఈ ట్వీట్ చాలామందికి మంచి హై ఇచ్చింది. ఇక్కడితో 158వ సినిమా మీద బాబి విపరీతమైన ఏకాగ్రత పెట్టాలి. శ్రీకాంత్ ఆ రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే బాబీ శ్రీకాంత్ కంటే ముందు చేస్తున్న సినిమాతో ఇంకా హై క్రియేట్ చేయగలగాలి. సంక్రాంతి సీజన్లో సినిమాకి యావరేజ్ టాక్ వస్తే సరిపోతుంది అనుకునే మైండ్ సెట్ లో చాలామంది దర్శకులు ఉంటారు. కానీ ఈసారి మాత్రం మెగాస్టార్ సినిమా విషయంలో ఆ పప్పులు ఉడకవ్.
Also Read: TVK Maanadu : విజయ్ పొలిటికల్ బోణి అదిరిపోయింది… ఏకంగా 86 లక్షల మంది