BigTV English

Suryakumar Yadav : ఐసీసీ టీ 20 జట్టు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్..

Suryakumar Yadav : టీ 20 జట్టుని ఐసీసీ ఎంపిక చేసింది. గత ఏడాది అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను ఆ జట్టులోకి తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ ని నియమించింది. దీంతో సూర్య ఆటపై ఐసీసీకి ఎంత గురి కుదిరిందని నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. సూర్యాతో పాటు మరో ముగ్గురు టీమ్ ఇండియా ఆటగాళ్లను ఐసీసీ ఎంపిక చేసింది. వారిలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్షదీప్ సింగ్ ఉన్నారు.

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత రోహిత్ శర్మ అజ్ణాతంలోకి వెళ్లాడు. ఈ దశలో విధిలేని పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ 20 సిరీస్ కి తాత్కాలిక కెప్టెన్ గా సూర్యని నియమించారు.

ఆ సిరీస్ ని 4-1తేడాతో గెలిపించిన సూర్య, తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో 1-1తో సిరీస్ ని సమం చేశాడు. అంతేకాదు 2023లో సూర్యకుమార్ బ్యాటర్‌గానూ విధ్వంసం సృష్టించాడు. 17 ఇన్నింగ్స్‌లో 733 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేగాక 2023 ఏడాదికి ఉత్తమ టీ20 క్రికెటర్ గా ఐసీసీ అవార్డుకు సూర్య షార్ట్ లిస్ట్ అయ్యాడు.

సూర్యకుమార్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల జర్మనీలో ఆపరేషన్ చేయించుకున్నాడు. తను కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. ఐపీఎల్ మధ్యలో ఆడే అవకాశాలున్నాయని సీనియర్లు అంటున్నారు.

యశస్వి జైశ్వాల్ 14 టీ 20 మ్యాచ్ లు ఆడి 430 పరుగులు చేశాడు. నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ అందుకున్న బిష్ణోయ్ ఇప్పటివరకు 24 మ్యాచ్ లు ఆడి 36 వికెట్లు తీశాడు. అర్షదీప్ 2023లో 21 మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు.

ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (భారత్, కెప్టెన్), యశస్వీ జైశ్వాల్ (భారత్), రవి బిష్ణోయ్ (భారత్), రిచర్డ్ (జింబాబ్వే), అర్షదీప్ సింగ్ (భారత్), మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్), సికిందర్ రజా (జింబాబ్వే), ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్), నికోలస్ పూరన్ (వెస్టిండీస్, వికెట్ కీపర్), అల్పేష్ రంజానీ (ఉగాండ), మార్క్ అడైర్ (ఐర్లాండ్).

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×