BigTV English

Suryakumar Yadav : సూర్య కుమార్ యాదవ్ గాయం పెద్దదా? చిన్నదా?

Suryakumar Yadav : సూర్య కుమార్ యాదవ్ గాయం పెద్దదా? చిన్నదా?
Suryakumar Yadav

Suryakumar Yadav : సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో గెలిచిన ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సెంచరీ చేసిన సూర్యకుమార్ ఎంతో సంతోషంతో కనిపించాడు. తర్వాత సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసే సమయంలో మూడో ఓవర్ లో బౌండరీ లైన్ వద్ద  ఫీల్డింగ్ చేస్తూ… స్పీడుగా పరుగెత్తి బాల్ ని త్రో చేశాడు. అనూహ్యంగా బ్యాలెన్స్ తప్పాడు. దాంతో చీలమండ దగ్గర బెణకడంతో గ్రౌండ్ లో విలవిల్లాడాడు. నడవలేని స్థితిలో ఉండటంతో ఫిజియో థెరపిస్టులు భుజాలపై మోసుకుని తీసుకెళ్లి, ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరువాత మ్యాచ్ పూర్తయ్యే వరకు మైదానంలోకి అడుగు పెట్టలేదు.


ఆలూ లేదు సూలు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు… ఏమీ తెలీకుండానే అప్పుడే నెట్టింట సూర్య ఫొటోలతో గందరగోళం మొదలైంది. సూర్యకు తీవ్రగాయమైనట్లు, ఇప్పటికిప్పుడు కోలుకోవడం కష్టమన్నట్టు ఫొటోలు హల్చల్ చేశాయి. టీ 20 వరల్డ్ కప్ కి ఎలా? సూర్య అందుబాటులో ఉండడా? అంటూ
అభిమానులు ఆందోళన చెందారు.

అయితే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో సూర్య సాధారణంగా కనిపించాడు. గాయం నొప్పి పెద్దగా లేదని, బాగానే ఉన్నానని చెప్పాడు. అది పెద్ద గాయమైతే కాదని అన్నాడు. అయితే గ్రౌండ్ లో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి సిరీస్ ట్రోఫీని సౌతాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్ తో కలిసి అందుకున్నాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా చక్కగా అందుకున్నాడు. దాంతో అభిమానులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.


ఈ మ్యాచ్ లో వంద పరుగులు చేయడంపై కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి అని తెలిపాడు. ముఖ్యంగా ఎలాంటి ఆందోళన లేకుండా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. అలాగే చేశామని తెలిపాడు. జట్టులోని మిగిలిన ప్లేయర్స్ అద్భుత ప్రతిభ చూపించారని తెలిపాడు. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్ ని తెగ మెచ్చుకున్నాడు. అతనెప్పుడూ  వికెట్ల ఆకలితో ఉంటాడు. ఈరోజు కులదీప్ పుట్టినరోజు అని తెలిపాడు. తను వికెట్లు తీసి టీమ్ ఇండియాకు బహుమతిగా ఇస్తే, మేం అంతా కలిసి జట్టు విజయాన్ని తనకి బహుమతిగా ఇచ్చామని అన్నాడు.  

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×