BigTV English

Praja Bhavan: రాజమహల్‌ లా ప్రజాభవన్.. వైరల్ అవుతోన్న వీడియో

Praja Bhavan: రాజమహల్‌ లా ప్రజాభవన్.. వైరల్ అవుతోన్న వీడియో

Praja Bhavan: ఒకప్పటి ప్రగతి భవన్.. ఇప్పుడు ప్రజాభవన్.. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం.. శత్రు దుర్భేద్యమైన ఇనుప కంచెలు.. ముళ్ల కంచెలు.. మూడంచెల భద్రత.. సామాన్యుడు కన్నెత్తి చూడాలన్నా చూసేందుకు తటపటాయించేలా ఉండేది ఆ భవనం. అసలు లోపల ఎలా ఉంటుంది? ఏంటన్నది మాత్రం ఎవ్వరికి తెలియదు. కానీ ఎన్నికల్లో ప్రజలు సారు, కారు గాలి తీయడంతో ఇప్పుడీ భవనం వీడియో బయటికి వచ్చింది. ఇది చూసిన వారంతా ఇది ప్రగతి భవన్ కాదు.. ఇంద్ర భవన్‌ అంటున్నారు.


రాజదర్పం తొణికిసలాడేలా కాస్ట్ లీ ఫర్నిచర్.. విశాలమైన హాల్.. అతి పెద్ద డైనింగ్ ఏరియా.. ఖరీదైన సోఫాలు.. మిరుమిట్లు గొలిపే లైటింగ్‌.. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ఈ ఇల్లే మాజీ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం… అదే ప్రగతి భవన్‌. ఈ ఇంటినే ఓ గడీగా మార్చేశారు గులాబీ బాస్. ఇక్కడికి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది అధికారులు, అప్పుడప్పుడూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చేవారు. వారి అదృష్టం కొద్ది అనుమతి లభిస్తే ప్రగతి భవన్‌ హాల్‌ వరకు ఎంట్రీ ఉండేది. నిజం చెప్పాలంటే కేసీఆర్‌ అనుమతి లేకుండా ప్రగతిభవన్‌లోనికి చిన్న చీమ కూడా అడుగుపెట్టేది కాదంటే ఖచ్చితంగా నమ్మాల్సిన విషయమే.

అప్పట్లో ఈ ఇంద్రభవనంలోకి వెళ్లేందుకు ప్రతిపక్షాలకు ఆ గేట్లు తెరుచుకునేవి కావు. బాధలో ఉన్నాం.. ముఖ్యమంత్రిని కలిసి బాధ చెప్పుకుందామంటే అనుమతి ఇచ్చేవారు కాదు. కానీ డిసెంబర్‌ 3 తర్వాత సీన్ మారింది. ప్రజాధనంతో నిర్మించిన భవనంలోకి ప్రజలకే అనుమతి లేకుండా చేసిన కేసీఆర్‌ సర్కార్‌ను తెలంగాణ ప్రజలు గద్దె దించారు. ప్రగతి భవన్‌ నుంచి బయటకు పంపించారు.


ప్రగతి భవన్ ప్రస్తుత ప్రజా భవన్ చాలా ప్రత్యేకంగా నిర్మించారని వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఈ వీడియో చూసిన వారందరిది ఒకే మాట. ఇది ప్రగతి భవన్ కాదు.. ఇంద్ర భవన్‌ అని.
కేసిఆర్ తాను నివసించడం కోసం ఇంత ఖరీదైన భవనాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్నారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా ప్రజల సొమ్ముతో నిర్మించిందేగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సామాన్య ప్రజలు ప్రగతి భవన్ లోకి వచ్చే అవకాశమే లేదు. చుట్టూ బారికేడ్లు, కంచెలతో లోపలి ఎవరూ వెళ్ళే వీలు లేకుండా ఉండేది. ఎమ్మెల్యేలు అయినా సరే కేసీఆర్ అనుమతి లేనిదే లోనికి ప్రవేశం లేదు. కానీ కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి రాగానే గడీల పాలనకు కేరాఫ్‌గా ఉన్న ఈ ప్రగతి భవన్‌ కంచెలను తొలగించారు. ప్రజా భవన్‌గా పేరు మార్చేసి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు అనుమతించారు. అంతేకాదు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ఈ భవనాన్ని కేటాయించారు. ఆయన గృహ ప్రవేశం చేసిన తర్వాత ఈ ఇంటికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×