BigTV English

Australia Bat England: ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆసీస్.. 36 పరుగుల తేడాతో విజయం!

Australia Bat England: ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆసీస్.. 36 పరుగుల తేడాతో విజయం!

T20 World Cup 2024 – Australia Won by 36 Runs against England: టీ 20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో సంచనాలు నమోదు కంటిన్యూ అవుతున్నాయి. చిన్న జట్లు దూకుడుకు పెద్ద జట్లు బెంబేలెత్తుతున్నాయి. తాజాగా రాత్రి బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది ఆస్ట్రేలియా. ఏకంగా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.


టాస్ ఓడిన ఆసీస్, తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్- డేవిడ్ వార్నర్‌ దిగారు. ఆరంభం నుంచే వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకున్నారు. మైదానం చుట్టూ సిక్స్‌లతో విరుచుకు పడ్డారు. వీళ్ల జోరుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రేక్షకులైపోయారు. కేవలం ఐదు ఓవర్లలో 74 పరుగులు చేసింది. వెంటనే వార్నర్ ఔటయ్యాడు. వీరిద్దరు ఫోర్లు కంటే సిక్స్‌లే ఎక్కువగా కొట్టారు. తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ సమయోచితంగా ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు. ఓపెనర్లు సాల్ట్-బట్లర్ జోడి దూకుడుగా ఆట మొదలు పెట్టింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 73 పరుగులు చేశారు. అయితే తర్వాత వచ్చిన ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయారు. ఐపీఎల్‌లో వీర విహారం చేసిన జాక్స్, బెయిర్ స్టో విఫలమయ్యారు. మెయిన్ అలీ, బ్రూక్స్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యారు.


Also Read: పసికూన నెదర్లాండ్స్ పై.. పోరాడి గెలిచిన సౌతాఫ్రికా

చివరకు మ్యాచ్‌ను చేజార్చుకున్నారు ఇంగ్లీష్ ఆటగాళ్లు. 20 ఓవర్లలో కేవలం ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, జంపా రెండేసి వికెట్లు తీశారు. జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఇద్దరు ఆటగాళ్లు 40కి పైగానే పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం. జోర్డాన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×