BigTV English

SA Won by 4 Wickets: పసికూన నెదర్లాండ్స్ పై.. పోరాడి గెలిచిన సౌతాఫ్రికా..!

SA Won by 4 Wickets: పసికూన నెదర్లాండ్స్ పై.. పోరాడి గెలిచిన సౌతాఫ్రికా..!

T20 World Cup 2024 – South Africa Won by 4 Wickets against Netherlands: అసలు సౌతాఫ్రికాకి ఏమైంది? ఎందుకిలా ఆడుతోంది? సిరీస్ ల్లో అద్భుతంగా ఆడుతూ మెగా టోర్నమెంట్లలో ఇలా ఎందుకు చేస్తోంది? అని నెట్టింట పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే గ్రూప్ డిలో జరిగిన నెదర్లాండ్స్ మ్యాచ్ లో సౌతాఫ్రికాకి చావు తప్పి కన్నులొట్టబోయింది. చివరికి చచ్చీ చెడి గెలిచింది.


టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగు తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇవి చేయడానికి సౌతాఫ్రికా చెమటలు కక్కింది. ఎట్టకేలకు 18.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి బతుకుజీవుడా అని ఒడ్డున పడింది.

104 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ప్రారంభంలో చుక్కలు కనిపించాయి. నెదర్లాండ్స్ బౌలర్లు వేసే బంతులకి వారి వద్ద ఆన్సర్ లేకుండా పోయింది. ఫలితంగా ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), రీజా హెండ్రీక్స్(3), ఎయిడెన్ మార్క్‌రమ్(0) వరుసగా పెవిలియన్ చేరడంతో సౌతాఫ్రికా 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఎన్నో అంచనాలతో బ్యాటింగ్‌కు హెన్రీచ్ క్లాసెన్(4)కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో సౌతాఫ్రికా 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


Also Read: Jasprit Bumrah Bowling : అట్లుంటది.. మనోడితోని..! : గేమ్ ఛేంజర్ అతడే!

ఈ దశలో డేవిడ్ మిల్లర్ ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. 51 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతేకాదు ట్రిస్టన్ స్టబ్స్ (33) తో కలిసి అసాధారణ ప్రదర్శన చేసి సౌతాఫ్రికాను ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 65 పరుగులు జోడించారు. ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్ ఔటైనా.. డేవిడ్ మిల్లర్ విజయతీరాలకు చేర్చాడు.

నెదర్లాండ్స్ బౌలర్లలో వివియన్ 2, లోగాన్ వాన్ బీక్ 2 , బాస్ డీ లీడే  ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ కి ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేదు. మిచెల్ లెవిట్ (0), మాక్స్ ఓ డౌడ్ (2) వెంటనే అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన విక్రమజిత్ సింగ్ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు.

Also Read: స్వైటెక్‌కి ఫ్రెంచ్ సింగిల్స్ టైటిల్, నాదల్ బాటలో

సైబ్రాండ్ మాత్రం కాసేపు ఆడి 45 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో లోగన్ (23), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ (10) కాసేపు హడావుడి చేశారు. తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు డక్ అవుట్ అయ్యాడు. ఇలా మొత్తానికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.

కివీస్ బౌలింగులో మార్కో జాన్సన్ 2, ఒట్నీల్ బార్ట్ మేన్ 4, అన్రిచ్ 2 వికెట్లు పడగొట్టారు.

Related News

Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం !

హర్మన్‌ కు ఏది చేత‌కాదు, 330 టార్గెట్ ను కాపాడుకోలేక‌పోయారు..ఇంట్లో గిన్నెలు తోముకోండి?

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Big Stories

×