Virat Kohli : టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతని ఆటను ప్రపంచ వ్యాప్తంగా ఆస్వాదిస్తారు. అయితే ఆసియా కప్ 2025 లో టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడటం లేదు. అయితే విరాట్ కోహ్లీ ఆడకపోయినప్పటికీ అతని గురించి మాత్రం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..? విరాట్ కోహ్లీని ఉగ్రవాదులు సైతం పొగుడుతున్నారు. కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉగ్రవాదులు కూడా ఆయన క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. ప్రముఖ ఉగ్రవాద సంస్థ తాలిబన్ కీలక సభ్యుడు అనాస్ హక్కా నీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ 50 ఏళ్లు వచ్చేంత వరకు క్రికెట్ ఆడుతూ ఉండాలి. తాలిబన్లు కోహ్లీ బ్యాటింగ్ చూడటం తెగ ఎంజాయ్ చేస్తారని వెల్లడించాడు.
Also Read : Hardik pandya : రోబో కంటే దారుణంగా మారిపోతున్న హార్దిక్ పాండ్యా… అందుకే నటాషా వదిలేసిందా !
దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ పై తాలిబన్లు కామెంట్స్ చేయడంతో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పక్కా అని సోషల్ మీడియాలో చర్చ జరగడం గమనార్హం. మరోవైపు కోహ్లీ త్వరగా రిటైర్మెంట్ అయ్యాడు. ఇంకొన్నాళ్లు ఆడాల్సింది అని అభిమానులు పేర్కొంటున్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఆటగాడు కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లండన్ లో ఉంటున్నాడు. మ్యాచ్ లు ఉన్నప్పుడు మాత్రమే విరాట్ కోహ్లీ టీమిండియా తరపున మ్యాచ్ లు ఆడేందుకు వస్తున్నాడు. మరోవైపు ఆసియా కప్ 2025లో టీమిండియా రేపు పాకిస్తాన్ తో తలపడనుంది. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ తలపడ్డ మ్యాచ్ ల్లో పలువురు బ్యాట్స్ మెన్స్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా తరపున విరాట్ కోహ్లీ 11 టీ-20 మ్యాచ్ లు ఆడి మొత్తం 492 పరుగులు చేశాడు. పాకిస్తాన్ పై యువరాజ్ సింగ్ 155 పరుగులు చేశాడు.
ఆసియా కప్ 2025 ప్రారంభ మ్యాచ్ లో యూఏఈ ఘన విజయం సాధించిన భారత జట్టు పాకిస్తాన్ తో హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆదివారం జరుగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొందరూ మాత్రం పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని పేర్కొంటున్నారు. బీసీసీఐ, భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మ్యాచ్ ల్లో భారత్ ఆడకపోతే జట్టుకే నష్టం కలుగుతుందని తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ రాగూర్ కూడా స్పష్టం చేశారు. చిరకాల ప్రత్యర్థులపై టీమిండియా ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లతో బరిలోకి దిగుతుందని ఇటీవల భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేర్కొన్నారు. యూఏఈ తో ఆడిన అదే టీమిండియా పాకిస్తాన్ తో కూడా బరిలోకి దిగనున్నట్టు సమాచారం.