KTR: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణల చేశారు. 17 వందల కోట్ల రూపాయలకు గ్రూప్ -1 పోస్టులను అమ్ముకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్ లో చేరబోనని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో చేరాల్సి వస్తే రైలు కింద తల పెడతానన్నారు. కాంగ్రెస్ లో చేరి ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని అంటున్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. గద్వాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కేసీఆరే.. బీఆర్ఎస్ లో ఉన్నానన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సభకు ఎందుకు రాలేదు..? 6 నుంచి 9 నెలల్లో గద్వాలలో ఉప ఎన్నికలు ఖాయం.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది.. పార్టీ మారిన పది మంది రాజీనామా చేయక తప్పదు’ అని కేటీఆర్ అన్నారు.
ALSO READ: Warangal Congress Clash: వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన విభేదాలు..
గడిచిన 22 నెలల్లో రేవంత్ సర్కార్ గద్వాలకు ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయాయని నిలదీశారు. రైతుబంధు రూ.15 వేలు, పింఛన్ రూ.4 వేలు, పెళ్లికి తులం బంగారం, ఆడ బిడ్డలకు రూ.2వేలు వంటి గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ అడిగారు. ఈ హామీల కోసమే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారారా..? అని ఆయన తీవ్ర స్తాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఉపఎన్నికల్లో చూసుకుందాం, ఎవరి సత్తా ఏంటో.. ఎవరి పని తీరు ఏందో ప్రజలు నిర్ణయిస్తారని సీఎ రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం రైతుల యూరియాను అమ్ముకుంటోందని, గ్రూప్-1 ఉద్యోగాలు అంగట్లో అమ్ముకున్నట్టు అమ్ముకుందని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏ పార్టీలో ఉన్నావని అడిగితే.. సమాధానం చెప్పే దిక్కులేదని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
ALSO READ: Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి