Tanveer Ahmed: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. గురువారం ఇంగ్లాండ్ ను దారుణంగా ఓడించిన టీమిండియా.. ఫైనల్ లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ( sanju samson ) 89 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో టీమిండియా విజయం సాధించగలిగింది. అయితే సంజు శాంసన్ భయంకరంగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతని బ్యాటింగ్ విధానం పై అనుమానాలు వ్యక్తం చేశారు. సంజు శాంసన్ వాడే బ్యాట్ లో చిప్ లు ( chips in sanju samson bat ) ఉన్నాయని ఆరోపణలు చేశారు. అభిషేక్ శర్మ ( Abhishek Sharma) భయంకరంగా ఆడతాడని అందరూ అనుకుంటే.. అసలు ఫామ్ లో లేని సంజు శాంసన్ రాణించడం ఏంటని నిలదీశారు తన్వీర్ అహ్మద్. అందుకే సంజు శాంసన్ బ్యాట్లు చెక్ చేయాలని ఐసీసీని డిమాండ్ చేశారు.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ లో సంజు శాంసన్ 89 పరుగులతో ఇరగదీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సంజు శాంసన్ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్ సందర్భంగా హ్యారీ బ్రూక్ క్యాచ్ వదలడంతో.. సంజు కు లక్కు కలిసి వచ్చిందని పేర్కొన్నారు. లేకపోయి ఉంటే టీమ్ ఇండియా ఓడిపోయేదని వెల్లడించారు. మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్ కు లైఫ్ వస్తే.. అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తారని గుర్తు చేశారు.
బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లపై మాత్రమే సంజు శాంసన్ ఆడతాడని వెల్లడించారు. అయితే నిన్నటి మ్యాచ్ లో సంజు శాంసన్ వాడిన బ్యాడ్ పై అనుమానాలు ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్. భయంకరంగా బ్యాటింగ్ చేయగల అభిషేక్ శర్మ సరిగ్గా ఆడడం లేదు కానీ.. సంజు శాంసన్ ఎలా ఆడుతున్నాడని నిలదీశారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని బాంబు పేల్చారు. అందరికీ డౌట్ రాకుండా అభిషేక్ శర్మ విఫలమౌతూ వస్తున్నాడని పేర్కొన్నారు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ కంటే ముందే సంజు శాంసన్ బ్యాట్ చెక్ చేయాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్. అటు ముంబై వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 15వ ఓవర్ నుంచి ఫిక్సింగ్ జరిగిందని, దీని వెనుక జై షా ఉన్నాడని ఆరోపించారు.
Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయర్ అరాచకాలు…హోటల్ పని మనిషిపై లైంగిక దాడి !
🚨 MASSIVE STATEMENT BY TANVEER AHMED ON SANJU SAMSON 🚨
Tanveer Ahmed said 🗣️
"There is a lot of talk about Sanju Samson, that he scored 89 runs, but a catch was definitely dropped. When you dropped a catch of a player like him, and he is already in good form, he will just… pic.twitter.com/LVr5JCz76G
— Cricket Central (@CricketCentrl) March 6, 2026