Tanveer Ahmed On IND VS NZ 4Th ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ 4Th ODI) మధ్య జరిగిన నాలుగో వన్డే సందర్భంగా శ్రేయస్ అయ్యర్ సేన చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీలైతే రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. భారత జట్టును ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఓటమిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ఒక్క విజయంతో టీమిండియా భవిష్యత్తును న్యూజిలాండ్ తలకిందులు చేసిందని బాంబు పేల్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామని విర్ర వీగుతున్న టీమిండియా కలను న్యూజిలాండ్ భగ్నం చేసిందని హాట్ కామెంట్స్ చేశాడు. నాలుగో వన్డే సందర్భంగా న్యూజిలాండ్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నుంచి టీమిండియా కోలుకోవడం కష్టమేనని తేల్చి చెప్పాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
నాలుగవ వన్డేలో (IND VS NZ 4Th ODI) టీమిండియా చిత్తుగా ఓడిపోవడంపై తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశాడు. విదేశాల్లో తేలిపోతుందని తాను ముందు నుంచి టీమిండియా గురించి చెబుతున్నానని.. కానీ ఎవరు నమ్మడం లేదని సెటైర్లు పేల్చాడు. విదేశీ గడ్డలపై టీమిండియా రాణించడం కష్టమేనని.. కేవలం ఫ్లాట్ మైదానాలపైనే ఆడతారని హాట్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు ఉన్నా కూడా నాలుగవ వన్డేలో టీమ్ ఇండియాను కాపాడలేకపోయారని హేళన చేశాడు. న్యూజిలాండ్ దెబ్బకు 2027 వన్డే వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ లోనే టీమ్ ఇండియా ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ లో టి20 సిరీస్, మొదటి రెండు వన్డేలు టీమిండియా గెలవడంపై తనకు అనుమానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి అని బాంబు పేల్చాడు. దీనిపై కచ్చితంగా ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశాడు.
బే ఓవల్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో 244 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 50 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా 333 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హెన్రీ దెబ్బకు టీమిండియా కుదేలైంది. దీంతో 26.4 ఓవర్లు ఆడిన అయ్యర్ సేన 89 పరుగులకు కుప్పకూలింది.