Rohit Sharma and Ishan Kishan Drop Two Catches: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team India vs New Zealand) మధ్య బే ఓవెల్ (Bay Oval, Mount Maunganui) వేదికగా నాలుగో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. అయితే ఇందులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు కీలక క్యాచ్ లను వదిలేశారు. ఈ అవకాశాలను వినియోగించుకున్న న్యూజిలాండ్ ఆటగాడు విల్ యంగ్ (Will Young) సూపర్ సెంచరీ చేశాడు. 5 పరుగుల వద్ద అతడికి లైఫ్ రాగా.. 125 పరుగులు చేసి ఇరగదీశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ల ఫీల్డింగ్ పై విమర్శలు వస్తున్నాయి.
ఇమిడియ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగవ వన్డే సందర్భంగా ఓపెనర్ విల్ యంగ్ సూపర్ సెంచరీ నమోదు చేశాడు. 108 బంతులు ఎదుర్కొన్న విల్ యంగ్ 125 పరుగులు సాధించాడు. ఇందులో 14 బౌండరీలతో పాటు నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ ప్రారంభంలో రెండవ ఓవర్ అకీబ్ నబీ వేశాడు. తన తొలి బంతిని ఎదుర్కొన్న విల్ యంగ్, స్లిప్పులో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.
కానీ కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన రోహిత్ శర్మ ఆ క్యాచ్ వదిలేశాడు. రెండో బంతిని యంగ్ భారీ షాట్ ఆడగా, మిస్ అయి ఇషాన్ కిషన్ చేతిలోకి వెళ్లింది. ఆ క్యాచ్ కూడా ఇషాన్ కిషన్ జార విరిచాడు. దీంతో విల్ యంగ్ కు రెండు లైఫ్ లు వచ్చాయి. ఐదు పరుగుల వద్ద రెండుసార్లు ఔట్ కాకుండా బయట పడ్డ విల్ యంగ్, సెంచరీతో ఇరగదీశాడు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. అయితే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరు క్యాచ్ లు మిస్ చేయడంతో గౌతమ్ గంభీర్ డగౌట్ లో కూర్చొని సీరియస్ అయ్యాడు.
TWO CATCHES DROPPED
Young gets two massive lifelines as Rohit Sharma and Ishan Kishan both drop catches off Auqib Nabi's bowling.
NZ getting lucky today .#NZvIND #INDvsNZ #TeamIndia #Cricket #SonySportsNetwork pic.twitter.com/0OAFfqqLLE
— Mr. X (@The_X_vibe) November 13, 2026