Tanveer Ahmed On IND VS PAK: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 tournament) ఫైనల్ శనివారం జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ అండర్ 19 జట్ల (Pakistan U19 vs India U19, Final) మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. ఒమన్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Al Amerat Cricket Ground Al Amerat) వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. అయితే ఈ క్రమంలో ఈ మ్యాచ్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాను ఓడిస్తామని పాకిస్తాన్ మాజీలు రెచ్చిపోయి రియాక్ట్ అవుతున్నారు. గ్రూప్ స్టేజ్ లో ఓడించినట్టుగానే రేపటి మ్యాచ్ లోను టీమిండియా జట్టును చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ లో (Under-19 Asia Cup 2026 tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవబోతుందని వెల్లడించాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదని.. సంబరాలు చేసుకునేందుకు పాకిస్తాన్ అభిమానులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చాడు. భారత క్రికెటర్లు విదేశీ గడ్డపై కచ్చితంగా విఫలమవుతారని… పాకిస్తాన్ దెబ్బకు చిత్తు అవుతారని చురకలు అందించాడు.
పాకిస్తాన్ జూనియర్ జట్టు బౌలింగ్ అత్యంత ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. అలీ రాజా ఒక్కడే టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తాన్ని కూల్చుతాడని వార్నింగ్ ఇచ్చాడు. అతని దెబ్బకు టీమిండియా బ్యాటర్ల హెల్మెట్లు పగిలిపోతాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను ఓడించకపోతే పాకిస్తాన్ లో బట్టలు లేకుండా తిరుగుతానని తన్వీర్ అహ్మద్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆసియా కప్ ఫైనల్ లో గెలుస్తామని…150 కోట్ల భారతీయులు తల దించుకునేలా చేస్తామంటూ శపథం చేశాడు. దీంతో మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ అద్భుతంగా ఆడతాడని తన్వీర్ అహ్మద్ అంచనా వేశాడు. అతనిని ఒక్కడిని అవుట్ చేస్తే టీమిండియా కుప్పకూలుతుందని అంచనా వేశాడు. అతని వికెట్ కోసం పాకిస్తాన్ ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేసాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ తప్ప టీమిండియాలో తోపు బ్యాటర్లు ఎవరూ లేరంటూ హేళన చేశాడు.