Kyle Jamieson Warns Gurnoor Brar: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 4th ODI) మధ్య బే ఓవల్ వేదికగా (Bay Oval, Mount Maunganui) జరిగిన నాలుగో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సేన చిత్తుగా ఓటమి పాలైంది. టార్గెట్ ఛేదించే క్రమంలో టాపార్డర్ కుప్పకూలడంతో 244 పరుగుల భారీ తేడాలో ఓడిపోయింది టీమిండియా. అయితే, ఈ మ్యాచ్ లో భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ కు లైవ్ మ్యాచ్‌లోనే కైల్ జేమీసన్ వార్నింగ్ ఇచ్చాడు. 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గుర్నూర్ బ్రార్ ను టార్గెట్ చేసిన న్యూజిలాండ్ బౌలర్లు, అతని తలను టార్గెట్ చేసి బౌలింగ్ చేశాడు. అంతేకాదు మ్యాట్ హెన్రీ వేసిన ఓ బౌన్సర్ గుర్నూర్ బ్రార్ హెల్మెట్ ను కూడా బలంగా తగిలింది. ఈ తరుణంలోనే ఫ్రంట్ లో ఫీల్డింగ్ చేస్తున్న కైల్ జేమీసన్, గుర్నూర్ బ్రార్ కు ( Kyle Jamieson Warns Gurnoor Brar) వార్నింగ్ ఇచ్చాడు. మా జోలికి వస్తే, పక్క బొక్కలు విరగొడతామని సైగలు చేస్తూ హెచ్చరించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బే ఓవల్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో గుర్నూర్ బ్రార్ తన బౌలింగ్ సమయంలో కాస్త ఓవరాక్షన్ చేశాడు. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ తో గొడవ పడ్డాడు. గుర్నూర్ బ్రార్ వేసిన 7వ ఓవర్ లో టిమ్ సీఫెర్ట్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఆ ఓవర్ లో 6, 4, 4 బాది 14 పరుగులు పిండుకున్నాడు. ఈ తరుణంలోనే సహనం కోల్పోయిన గుర్నూర్ బ్రార్, టిమ్ సీఫెర్ట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇక అర్థ సెంచరీ చేసిన తర్వాత గుర్నూర్ బ్రార్ వేసిన ఓ బ్యూటీఫుల్ బంతికి టిమ్ సీఫెర్ట్ క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలోనే టిమ్ సీఫెర్ట్ ముందుకు వెళ్లి, గుర్నూర్ బ్రార్ బుతూలు తిడుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో సీరియసైన టిమ్ సీఫెర్ట్ కూడా బ్యాట్ పట్టుకుని పై పైకి వచ్చాడు. ఇంతలోనే అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ, గుర్నూర్ బ్రార్ ను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దీంతో గొడవ చల్లబడింది. అయితే, ఈ సంఘటనను మనసులో పెట్టుకున్న కివీస్ ప్లేయర్లు, 10వ స్థానంలో వచ్చిన గుర్నూర్ బ్రార్ కు (Gurnoor Brar) చుక్కలు చూపించాడు. బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులు వేసి ఇబ్బంది పెట్టారు. ఇక ఈ సంఘటనపై ఐసీసీ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం.
For days, Brar has been peppering New Zealand's tailenders with bouncers and bodyline deliveries.
Today, Matt Henry returned the favour with a nasty bouncer. The commentators were quick to point out that Brar was getting a taste of his own medicine.
Fair enough. But if Henry is… pic.twitter.com/gBHAIRemph
— Brutal Truth (@sarkarstix) November 13, 2026