Bangladesh Player Kissing Pakistan Flag: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026) చివరి దశకు వచ్చిన నేపథ్యంలో బంగ్లాదేశ్ జూనియర్ జట్టు ఆటగాడు వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ జెండాను ముద్దాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ టోర్నమెంట్ లో భాగంగా అండర్ 19 పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (Pakistan U19 vs Bangladesh U19, Semi Final 1) మధ్య తొలి సెమీ ఫైనల్ నవంబర్ 12వ తేదీన అంటే గురువారం జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా ఇరు జట్లు తమ దేశాల జాతీయ గీతాలు ఆలపించాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ అండర్ 19 జట్టుకు సంబంధించిన ఓ ప్లేయర్ పాకిస్తాన్ జాతీయ జెండాను ముద్దాడాడు.
పాకిస్తాన్ జాతీయ జెండాను ముద్దాడిన తర్వాత పక్కనే ఉన్న బంగ్లాదేశ్ జెండాను కూడా గౌరవిస్తూ ఓ సెల్యూట్ చేశాడు సదరు ప్లేయర్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు ఒకటే అని మరోసారి రుజువు అయిందని కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ వేసే ఎంగిలి మెతుకులకు బంగ్లాదేశ్ ఇలా దిగజారి ప్రవర్తిస్తోందని మండిపడుతున్నారు. పాకిస్తాన్ ఎంత మోసం చేసినా బంగ్లాదేశ్ క్రికెటర్లకు సిగ్గు రాదని మరి కొంత మంది రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి బంగ్లాదేశ్ కుక్కలను ఇండియాకు రానివ్వొదని, ఐపీఎల్ ఆడనివ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా కూడా ఇలాంటి వివాదంలోనే గతంలో చిక్కుకుంది. ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ కీలక మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా గ్రౌండ్ లో కింద పడిపోయిన పాకిస్తాన్ జెండాను… మళ్లీ పాతి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో అప్పట్లో బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తాన్ పై విమర్శలు కూడా వచ్చాయి.
ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ నిన్న జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో పాకిస్తాన్ విక్టరీ అందుకుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించిన టీమిండియా కూడా ఫైనల్ కు చేరింది. ఈ క్రమంలో రేపు ఒమన్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
?utm_source=ig_web_copy_link&dlrf=NTc4MTIwNjQ2YQ==