Shoaib Akhtar On IND VS PAK: ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026) ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఫైనల్స్ బరిలో టీమిండియా, పాకిస్తాన్ అండర్ 19 జట్లు (Pakistan U19 vs India U19, Final) తలపడనున్నాయి. శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. టీమిండియా అండర్ 19 జట్టు గెలుస్తుందని కొంతమంది అంటుంటే.. పాకిస్తాన్ విక్టరీ అందుకోవడం గ్యారెంటీ అని మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఎక్కడ మ్యాచ్ జరిగినా చాలా ఇంట్రెస్ట్ గా జనాలు చూస్తారని వ్యాఖ్యానించాడు. అయితే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందని వెల్లడించాడు. తన అంచనా ప్రకారం పాకిస్తాన్ పైన టీమిండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయని వివరించాడు.
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాతో తలపడడం అంటే పాకిస్తాన్ జట్టుకు పెద్ద సవాల్ అని షోయబ్ అక్తర్ వెల్లడించాడు. ఈ మ్యాచ్ పాకిస్తాన్ జట్టుకు అగ్నిపరీక్ష లాంటిదేనని వ్యాఖ్యానించాడు. సెమీ ఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఏక పక్షంగా ఓడించి భారత జట్టు ఫైనల్ కు చేరిందని ప్రశంసించాడు. భారతీయ దేశవాళి క్రికెట్ వ్యవస్థ అత్యంత బలంగా ఉందని గుర్తు చేశాడు. 150 కోట్ల భారత దేశంలో చాలా మంది టాలెంటెడ్ క్రికెటర్లు తెరపైకి వస్తున్నారని… ఇందులో రాటుదేలిన వాళ్ళు రేపటి ఫైనల్ మ్యాచ్ లో ఆడుతున్నట్టు వివరించాడు.
ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో కూడా అద్భుతంగా రాణించి అంతర్జాతీయ మ్యాచుల్లోకి వస్తున్నారని మెచ్చుకున్నాడు. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అలాంటి పరిస్థితులు లేవని బాంబు పేల్చాడు. బౌలింగ్ బాగా చేస్తే బ్యాటింగ్ విఫలమవుతుందని… బ్యాటింగ్ లో ఇరగదీస్తే.. బౌలింగ్ లో తేలిపోతారని పాకిస్తాన్ జట్టును విమర్శలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే ఫలితాలు బాగా వస్తాయని తెలిపాడు. ఇక రేపటి మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు షోయబ్ అక్తర్. ఫైనల్ మ్యాచ్ ను లైట్ తీసుకోకుండా, ప్రతి ఒక్కరూ రాణించాలని కోరారు. గ్రూప్ స్టేజ్ లో ఓడించినట్టు గానే టీమిండియాను చిత్తు చేయాలని కోరాడు.