Redmi Watch 5 Active: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు, బ్రాండెడ్ నమ్మకం కోరుకునే వారి కోసం షియోమి (Xiaomi) నుంచి వచ్చిన ఒక అదిరిపోయే గాడ్జెట్ ‘రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్’ (Redmi Watch 5 Active). లాంచ్ అయినప్పటి నుంచి క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ వాచ్, ఇప్పుడు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో జస్ట్ రూ. 1,999 కే లభిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ బడ్జెట్ కింగ్ స్మార్ట్‌వాచ్ లో ఉన్న టాప్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బిగ్ డిస్‌ప్లే.. మెటాలిక్ లుక్ (2.0-inch HD Screen):
ఈ వాచ్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో పెద్ద 5.08cm (2.0-inch) హై-రిజల్యూషన్ ఎల్‌సిడి స్క్రీన్ ఇచ్చారు. దీని వల్ల ఎండలో వెళ్లినా కూడా అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.అంతే కాకుండా దీని చుట్టూ ఉన్న మెటల్ ఫినిష్ బాడీ వాచ్‌కి ఒక రిచ్ అండ్ క్లాసీ లుక్‌ను ఇస్తుంది. ఇందులో 200 కి పైగా డిఫరెంట్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. కాబట్టి మీ డ్రెస్సింగ్ కి తగ్గట్టు రోజుకో లుక్ మార్చేయొచ్చు.
2. క్రిస్టల్ క్లియర్ బ్లూటూత్ కాలింగ్ (3-Mic ENC):
చాలా మంది బడ్జెట్ వాచెస్ లో కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి సౌండ్ సరిగ్గా వినపడదు. కానీ.. రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్‌లో ఆ ప్రాబ్లమ్ లేదు.ఇందులో అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్‌తో పాటు 3-మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. మీరు ట్రాఫిక్‌లో లేదా కాస్త రద్దీగా ఉండే ఏరియాలో ఉన్నా.. కూడా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించి, వాయిస్ చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.
3. మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్ (18 Days battery):
స్మార్ట్‌వాచ్‌లను రోజు మార్చి రోజు ఛార్జింగ్ పెట్టడం పెద్ద తలనొప్పి కదా? ఈ విషయంలో రెడ్‌మి ఒక సూపర్ అప్‌డేట్ ఇచ్చింది. ఇందులో ఉన్న పవర్‌ఫుల్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ వల్ల, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 18 రోజుల పాటు బ్యాటరీ వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే! లాంగ్ ట్రిప్స్‌కి వెళ్లేటప్పుడు ఛార్జర్ పట్టుకెళ్లాల్సిన అవసరమే లేదు.
4. షియోమి హైపర్‌ఓఎస్ సపోర్ట్ (Xiaomi HyperOS):
ఈ వాచ్‌లోని మరో పెద్ద హైలైట్ ఏంటంటే.. ఇది షియోమి లేటెస్ట్ HyperOS పై రన్ అవుతుంది. దీని వల్ల వాచ్ యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా ఉంటుంది, ఎక్కడా ల్యాగ్ లేదా హ్యాంగ్ అవ్వదు. అంతేకాదు, ఇందులో Alexa Built-in వస్తుంది. అంటే మీ వాయిస్ కమాండ్స్ తోనే అలారమ్స్ పెట్టడం లేదా టాస్క్స్ కంట్రోల్ చేయడం లాంటివి స్మార్ట్‌గా చేసేయొచ్చు.
Also Read: బిజినెస్ కైనా, ఇంటికైనా.. స్ట్రాంగ్ కూలింగ్ ఇచ్చే బెస్ట్ డీప్ ఫ్రీజర్స్
5. హెల్త్ & ఫిట్‌నెస్ ట్రాకింగ్ (140+ Sports Modes):
హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఐ-కోచ్. ఇందులో 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్, స్లీప్ ట్రాకింగ్ , స్ట్రెస్ మేనేజ్‌మెంట్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్నాయి. మీరు రన్నింగ్, సైక్లింగ్, జిమ్ లేదా యోగా.. ఏది చేసినా ట్రాక్ చేయడానికి 140 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఇచ్చారు. ఇది IPX8 రేటింగ్ తో వస్తుంది కాబట్టి చెమట లేదా చిన్నపాటి నీటి చినుకులకు పాడైపోదు.
మీకు రూ. 2,000 లోపు బ్రాండెడ్ వాచ్ కావాలి, పైగా కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ సూపర్ గా ఉండాలి అనుకుంటే కళ్ళు మూసుకుని Redmi Watch 5 Active సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ సేల్స్ లో బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ వాడితే ఇది ఇంకాస్త తక్కువకే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత పెద్ద డిస్‌ప్లే, 18 రోజుల బ్యాటరీ లైఫ్ , HyperOS సపోర్ట్ ఉన్న వాచ్ దొరకడం చాలా రేర్. కాబట్టి ఈ వాచ్ డీల్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.